Malavya Rajyog: సెప్టెంబర్ 3వ వారంలో ఈ రాశుల వారికి మాళవ్య యోగం ఎఫెక్ట్.. వారం రోజులు డబ్బే డబ్బు..
Malavya Rajyog September 3rd Week: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ మూడవ వారంలో ఎంతో శక్తివంతమైన కొన్ని యోగాలు ఏర్పడబోతున్నాయి దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
Malavya Rajyog September 3rd Week: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ మూడవ వారం అత్యంత ప్రీతికరమైంది గా భావించవచ్చు. ఎందుకంటే ఈ వారంలో ఎంతో ప్రత్యేకత కలిగిన కొన్ని గ్రహాలు రాశి సంచారం చేయడంతో పాటు మరికొన్ని గ్రహాలు నక్షత్ర సంచారం కూడా చేయబోతున్నాయి.. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన మాళవ్య రాజయోగం, ఇతర రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. జాతకంలో ఈ యోగం శుభ స్థానంలో ఉన్న రాశుల వారికి డబ్బు పరంగా ఎలాంటి డోకా ఉండదు. అంతేకాకుండా దేవతల అనుగ్రహం కూడా లభించి అదృష్టాన్ని పొందుతారని జ్యోతిష్య శాస్త్రంలో క్లుప్తంగా పేర్కొన్నారు. అయితే సెప్టెంబర్ మూడవ వారంలో ఈ యోగంతో పాటు గ్రహ సంచారాల కారణంగా అత్యధిక లాభాలు పొందబోయే రాశుల వారెవరో, వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి:
సెప్టెంబర్ మూడవ వారంలో యోగ ప్రభావాలతో గ్రహసంచారాల ప్రత్యేకమైన ఎఫెక్ట్తో అత్యధిక లాభాలు పొందబోయే రాశుల వారిలో మేష రాశి ఒకటి. ఈ రాశికి కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ వారంలో వీరు వృత్తిపరంగా వస్తున్న సమస్యల నుంచి పరిష్కారం పొందబోతున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసేవారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. దీనికి కారణంగా వీరు అనుకున్న పరీక్షల్లో విజయాలు సాధించగలుగుతారు. అంతేకాకుండా ఈ సమయంలో జీవితంలో వచ్చే గొప్ప గొప్ప అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకునే ఛాన్స్ ఉంది. అలాగే వ్యాపారాలు చేస్తున్నవారు ఊహించని స్థాయిలో లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు సీనియర్ల సపోర్టు పొంది కష్టతరమైన పనులను కూడా ఎంతో సులభంగా చేసి ఆఫీసుల్లో ప్రశంసలు పొందుతారు.
సింహరాశి:
ఈ సమయంలో సింహ రాశి వారు కూడా ఊహించని అదృష్టాన్ని పొందబోతున్నారు. దీని కారణంగా వీరు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వారికున్న తెలివితేటలతో ఏకంగా వ్యాపారాలు కూడా ప్రారంభించే ఛాన్స్ కూడా ఉంది. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించే వారికి కూడా ఊహించని అదృష్టం లభిస్తుంది. అలాగే ఉద్యోగ రంగాల్లో స్థిరపడిన వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. దీంతోపాటు పోటీ పరీక్షల్లో కూడా ఊహించని విజయాల సాధిస్తారు. ఎప్పటినుంచో పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. దీని కారణంగా అనుకున్న ఉద్యోగాన్ని పొందే ఛాన్స్ కూడా ఉంది.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
తులారాశి:
తులా రాశి వారికి కూడా సెప్టెంబర్ మూడవ వారం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి అన్ని సమస్యల నుంచి విముక్తి లభించి బాహ్య జీవితంలో ఉత్సాహంగా సంతోషకరమైన రోజులను గడుపుతారు. అలాగే రాజకీయ రంగాలకు సంబంధాలు ఉన్న వ్యక్తులు ఈ సమయంలో అనుకున్న విజయాలు కూడా సాధిస్తారు. ఉద్యోగాలు చేస్తున్నవారు పదవులు పొందడమే కాకుండా జీతాలు కూడా పెంచుకుంటారు. అంతేకాకుండా వీరికి విశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో ఎలాంటి పనులైన ఎంతో చక్కగా స్పీడ్ స్పీడ్ గా చేయగలుగుతారు. ఇక భాగస్వామి జీవితం కూడా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అవగాహన పెరిగి.. ఒకరికొకరు ఎంతో ప్రేమగా ఉంటారు. అంతేకాకుండా ఈ సమయంలో మతపరమైన ప్రదేశాలను సందర్శించే ఛాన్స్ కూడా ఉంది.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.