Mangal Gochar Transit In Chitra Nakshatra: సెప్టెంబర్ 23న కుజుడు చిత్రా నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. శక్తి, సోదరుడు, భూమి, బలం, ధైర్యం సూచికగా భావించే ఈ రాశి నక్షత్రంలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కుజుడు మేష, వృశ్చిక రాశికి అధిపతి వ్యవహరిస్తాడు. కాబట్టి అంగారకుడు చిత్రా నక్షత్రంలోకి సంచారం చేసిన వెంటనే కొన్ని రాశుల వారికి అదృష్టం రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ సంచారం కారణంగా కొన్ని రాశులవారికి దుష్ప్రభావాలు పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి:
మేష రాశి వారు ఈ సమయంలో తప్పకుండా స్వీయ నియంత్రణ కలిగి ఉంటే మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా అధిక కోపం ఉన్నవారు ఈ సమయంలో నియంత్రించుకోవడం చాలా మంచిది. ఈ సమయంలో కుటుంబం నుంచి సఫోర్ట్‌ లభించి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. 


వృషభ రాశి:
వృషభ రాశి ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. దీని కారణంగా మనస్సు కలత చెందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా సహనాన్ని కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరు ఈ సమయంలో తప్పకుండా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో కూడా తీవ్ర నష్టాలు కూడా రావచ్చు. 


Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    


మిథున రాశి:
మిథున రాశి వారికి మనసులో ఒడిదుడుకులు ఏర్పడతాయి. అంతేకాకుండా ఈ సమయంలో మీరు పాత స్నేహితులను కలుసుకునే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో మిథున రాశి వారు వ్యాపారాల్లో లాభాలు పొందే ఛాన్స్‌ కూడా ఉన్నాయి. 


మకర రాశి:
మకర రాశి వారు ఈ సమయంలో కోపాన్ని నియంత్రించుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా అన్ని విషయాల్లో ఓపిక పట్టడం చాలా మంచిది. ఈ సమయంలో మనస్సు కలవరపడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కుటుంబంతో కలిసి ఏదైనా ఆలయాలకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాలు కూడా మెరుగుపడతాయి. 


Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook