Mars Transit 2023 Effects: కుజుడు ఈ రాశువారి జీవితాల్లో వెలుగును నింపబోతున్నాడు. ముట్టింది బంగారమవ్వడం ఖాయం..
Mars Transit 2023 Effects: వచ్చే నెలలో కుజుడు సంచారం చేయబోతున్నాడు దీని కారణంగా చాలా రాశుల వారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఏయే రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Mars Transit 2023 Effects: జూలై 1న అంగారక గ్రహం సింహ రాశిలోకి సంచారం చేయబోతోంది. ఈ గ్రహం ఆగస్టు 18వ తేదీ దాకా సంచార దశలోనే ఉండబోతోంది. ఈ సంచారం కారణంగా నీచభంగ యోగం, మత్స్య యోగం, విష్ణు యోగలు ఏర్పడబోతున్నాయి. ఈ మూడు యోగాల వల్ల కొన్ని రాశుల వారికి మంచి జరిగితే మరికొన్ని రాశుల వారికి తీవ్ర నష్టాలు కూడా జరగవచ్చు అని జ్యోతిష్య శాస్త్రానికి చెబుతున్నారు. ముఖ్యంగా విష్ణు యోగం వల్ల కుజుడుకి సంబంధించిన అన్ని రాశుల వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ యోగాల వల్ల ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సింహరాశి:
సింహరాశిలోకి అంగారకుడు సంచారం చేయడం కారణంగా ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారికి ఆర్థికంగా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శత్రువుల పట్ల విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగాలు చేసే వారికి కార్యాలయాల్లో ప్రశంసల లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి లాభదాయకంగా ఉండబోతుందని.. కష్టపడి ప్రయత్నించే వారికి తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది.
Also Read: Guntur Karam Movie: 'గుంటూరు కారం' నుంచి పూజా హెగ్డే ఔట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..?
ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి 12వ స్థానంలో అధిపతిగా కుజుడు సంచారం జరగబోతోంది. ఈ కారణంగా ఈ రాశి వారికి కూడా లాభదాయకంగా ఉండబోతున్నట్లు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వ్యాపారాలు చేసేవారు ఊహించని లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకుండా వీరు కొత్త ఇల్లు లేదా ఇతర వస్తువులను కొనుగోలు చేసే ఛాన్స్ కూడా ఉంది. ఆస్తి తగాదాలతో బాధపడుతున్న వారికి ఈ క్రమంలో ఉపశమనం లభిస్తుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి కోరిక సులభంగా నెరవేరుతుంది.
మీన రాశి:
మీన రాశి వారికి కుజుడు సంచారం ఆరవ స్థానంలో జరగబోతోంది. దీని కారణంగా వీరు కోరుకున్న పదవులను పొందుతారు. అంతేకాకుండా వీరితో పెట్టుకున్న వారి ప్రత్యర్ధులు సులభంగా ఓడిపోయే అవకాశాలున్నాయి. ఈ సంచారం కారణంగా అదృష్టం రెట్టింపు అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీరు అంతర్జాతీయ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరికి ఆత్మవిశ్వాసం పెరిగి ధైర్యం కూడా రెట్టింపు అవుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి ఈ సంచార సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది.
Also Read: Guntur Karam Movie: 'గుంటూరు కారం' నుంచి పూజా హెగ్డే ఔట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి