Mars Transit 2024: జ్యోతిష్య శాస్త్రంలో అంగారక గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ గ్రహాన్ని అన్ని గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు. శక్తి, సోదరుడు, భూమి, బలం, ధైర్యం, ధైర్యసాహసాలకు ప్రతిగా చెప్పుకునే అంగారక గ్రహం సంచారం చేయడం వల్ల ప్రత్యేక ప్రభావం ఏర్పడుతుంది. ఈ గ్రహాన్ని వృశ్చిక రాశికి అధిపతిగా కూడా చెప్పుకుంటారు. అయితే ఈ గ్రహం ఇప్పుడు మకర రాశిలో సంచారం క్రమంలో ఉంది. ఆ తర్వాత జనవరి 16న ధనుస్సు రాశిలోకి కుజుడు సంచారం చేయబోతున్నాడు.  ఈ సంచారం కారణంగా కొన్ని రాశుల వారు అదృష్టాన్ని పొందడం ఖాయమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కుజుడు ధనుస్సు రాశిలోకి సంచారం చేయడం వల్ల ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి:
ఈ అంగారక గ్రహ సంచారం కారణంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ సులభంగా పరిష్కారమవుతాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా మంచి లాభాలు పొందుతారు. ఈ సమయంలో లావాదేవీల విషయంలో గొడవలు ఉంటే పరిష్కరించుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ సంచార సమయం వ్యాపారానికి అనుకూలమైన సమయంగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు వీరికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. ఇక ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. 


వృషభ రాశి:
కుజుడి సంచార ప్రభావం వృషభ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీని కారణంగా పాత స్నేహితులను కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు ఉద్యోగస్తులకు పదోన్నతులకు అవకాశాలు లభిస్తాయి. ఇక విద్యార్థలకు క్రీడలలో గొప్ప విజయాన్ని పొందవచ్చు.


Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..


మిథున రాశి:
ఈ సంచారం మిథున రాశివారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి కార్యాలయాల్లో ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. దీంతో పాటు పాత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయం సాధారణంగా ఉంటుంది.  విద్యార్థి అయితే పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. 


సింహరాశి:
సింహరాశి రాశివారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యంగా కూడా మెరుగుపడుతుంది. దీంతో పాటు వ్యాపారాల్లో కొత్త విషయాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా  పాత స్నేహితులను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయని జ్యోతిస్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter