Shani Uday 2024 effect: గ్రహాలన్నింటిలో కెల్లా అందమైన గ్రహం శని. పురాణాల ప్రకారం, సూర్యభగవానుడు పుత్రుడు శనిదేవుడు. శని వక్ర దృష్టికి ఎవరైనా భయపడాల్సిందే. మార్చి 17న శని గ్రహం మూల త్రికోణ రాశి అయిన కుంభరాశిలో ఉదయించబోతుంది. దీని కారణంగా కొందరి కష్టాలు మరింత పెరగనున్నాయి. ఆ జాబితాలో కన్యా, మకరం మరియు కుంభరాశులు ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభ రాశి
ఇదే రాశిలో శని ఉదయించడం వల్ల వీరి ఖర్చులు అధికమవుతాయి, కాబట్టి వేస్ట్ ఖర్చులు తగ్గించుకోండి. బండి నడిపేటప్పుడు జాగ్రత్త. ఈ సమయంలో ఎటువంటి పెట్టబడులు పెట్టొద్దు, నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మీ శత్రువులు మీపై విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఇబ్బందులు వస్తాయి.
మకర రాశి
ఈ రాశికి అధిపతి శనిదేవుడు. అందుకే శని గమనంలో మార్పు మకరరాశి వారికి సమస్యలను పెంచుతుంది. మీ ఆర్థిక సంక్షోబాన్ని ఎదుర్కోవల్సి రావచ్చు. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఈ సమయంలో ఎవరితోనూ డబ్బు లావాదేవీలు చేయెద్దు. నిరుద్యోగులు ఉద్యోగం కోసం మరింత కాలం వేచిచూడాల్సి రావచ్చు. ఆఫీసులో మీ సహద్యోగులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. 
కన్యా రాశి
కుంభరాశిలో శని ఉదయించడం వల్ల కన్యారాశి వారు అనేక కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది. మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు. ఈ సమయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మెుద్దు. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఈ టైంలో కెరీర్ కు సంబంధించిన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. శని ప్రభావం వల్ల భార్యభర్తలు మధ్య  గొడవలు వచ్చే అవకాశం ఉంది. 


(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Astrology - Mangal Gochar: మార్చి నెలలో కుజుడి రాశి మార్పు.. ఈ 4 రాశుల వారికి జాక్ పాట్ తగిలినట్టే..


Also Read: Chandra Grahan 2024: హోలీ పండుగ నాడే చంద్రగ్రహణం.. ఈ 3 రాశులవారు జాగ్రత్త..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook