COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shukra Planet Effects: గ్రహాలు తిరోగమనము చేసినప్పుడు వాటి ప్రత్యక్ష ప్రభావం అన్ని రాశుల వారిపై పడుతుంది దీని కారణంగా కొన్ని రాశుల వారు లాభాలు పొందితే మరికొన్ని రాశుల వారు తీవ్ర నష్టాల బారిన పడతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే జులై 23వ తేదీన శుక్రుడు సింహరాశిలో తీరోగమనం దశగా అడుగులు వేయబోతున్నాడు. ఈ తిరోగమనం  కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఘడియలు మొదలవబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు ఈ క్రమంలో వారు ఎలాంటి పనులు చేసిన జాక్ పాట్ కొట్టడం ఖాయమని అంటున్నారు. అయితే శుక్రుడు తిరోగమనం కారణంగా ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


శుక్రుడి తిరోగమనంతో జాక్ పాట్  కొట్టబోయే రాశులు ఇవే:


వృషభ రాశి:
శుక్రుడు తిరుగమనం కారణంగా వృషభ రాశి వారికి ప్రశాంత లభిస్తుంది. అంతేకాకుండా వీరు కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక విద్యార్థులకైతే ఇది సరైన సమయం గా భావించవచ్చు.. ఈ క్రమంలో వీరు పై చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. పరిశోధన రంగంలో పని చేసేవారు విదేశాలు సంచరించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగాలు చేస్తున్నవారు బాస్ ప్రమేయంతో మంచి గుర్తింపు కూడా పొందుతారు. వీరు ద్వేషపూరిత మాటలను మాట్లాడకపోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వృషభ రాశి వారి ఆదాయంలో భారీ మార్పులు వస్తాయి. ఈ క్రమంలో వీరి ఆదాయం రెట్టింపు అవ్వడమే కాకుండా ఖర్చులు తగ్గే ఛాన్స్ కూడా ఉంది. 


Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్.. భారీ నుండి అతి భారీ వర్షాలు


కర్కాటక రాశి:


ఈ తిరోగమన కారణంగా కర్కాటక రాశి వారికి కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అంతేకాకుండా తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తంలో ఆస్తులను పొందే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక కళా రంగంలో సంగీత రంగంలో పనిచేసే వారికి ఏది సరైన సమయంగా భావించవచ్చు. ఈ క్రమంలో కష్టపడి పని చేస్తే సమాజంలో మంచి పేరు పొందవచ్చు. ఉద్యోగాలు చేసేవారు జీతాల కోసం పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా తల్లిదండ్రులు పిల్లల నుంచి శుభవార్తలు కూడా వింటారు. కర్కాటక రాశి వారు శుక్రుడి తిరోగమనం కారణంగా కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తారు.


వృశ్చిక రాశి:
శుక్రుడితిరోగమనం కారణంగా వృశ్చిక రాశి వారు ఊహించని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రానికి చెబుతున్నారు. ఈ క్రమంలో వృశ్చిక రాశి వారు ఎంతో ఉత్సాహంగా పనులు చేస్తారు. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నవారు ప్రమోషన్స్ పొందడమే కాకుండా కంపెనీ మారేందుకు సన్నాహాలు చేస్తారు. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి అధికారుల సహకారం వల్ల రెట్టింపు ఉత్సాహంతో పనులు చేస్తారు. అంతేకాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ క్రమంలో సులభంగా ఉపశమనం లభిస్తుంది.. శుక్రుడి తిరోగమనంతో జాక్ పాట్ కొట్టబోతున్నారు.


Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్.. భారీ నుండి అతి భారీ వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook