COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Surya Shani Samsaptak Yog: ప్రత్యేక గ్రహాలు సంచారం చేయడం వల్ల శుభ, అశుభ యోగాలు ఏర్పడాయి. ఈ యోగాలు రాశులపై ప్రత్యేక్ష ప్రభావం చూపుతాయి. దీని కారణంగా కొన్ని రాశులవారు తీవ్ర నష్టాలకు గురవుతే, మరి కొన్ని రాశువారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  అయితే ఇటీవలే  శని, కుజ గ్రహాలు ఒకే రాశిలో కలిశాయి. దీని కారణంగా సంసప్తక యోగం ఏర్పడింది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.


చెడు ప్రభావానికి గురయ్యే రాశులవారు వీరే:
కన్యా రాశి: 

 సంసప్తక యోగం కన్యా రాశి వ్యక్తిగత జీవితంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ యోగం కారణంగా ఛాతీతో పాటు చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా రాజకీయాల్లో తిరిగే వారు సమాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. వీరు ఈ క్రమంలో తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. 


Also read: Godavari Floods: ఉగ్రరూపంతో గోదావరి, ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ


తుల రాశి:
తుల రాశి వారికి  ఈ యోగం కారణంగా కొంత అదృష్టం లభిస్తుంది. తోబుట్టువులు, స్నేహితుల నుంచి మద్దతు లభించి అనుకున్న పనులన్ని సులభంగా చేయగలుగుతారు. కానీ ఈ క్రమంలో మీ తండ్రి ఆరోగ్యం క్షీణించవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇదే క్రమంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలున్నాయి. కాబట్టి ఆర్థిక విషయాలపై, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. 


వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఈ యోగం కారణంగా కొన్ని లాభాలు కలిగితే మరికొంత మందికి నష్టాలు కలుగుతాయి. అయితే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి అదృష్టం కలిసి వస్తుంది. ఇక చేతి వృత్తులు చేసేవారికి సామర్థ్యం దెబ్బతింటుంది. అతను పాత ఆరోగ్య సమస్యలను తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంటి సమస్యల కారణంగా డబ్బులు ఖర్చు చేసే ఛాన్స్‌ కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మీ తండ్రికి అనారోగ్య సమస్యల వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మాటలో కూడా మార్పులు రావచ్చని నిపుణులు చెబుతున్నారు.


మకర రాశి:
ఈ యోగం ప్రభావం మకర రాశివారిపై కూడా పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ యోగం కారణంగా కుటుంబ విషయాలలో ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సమస్యల మరింత పెరగవచ్చు. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వీరికి పాత వ్యాధులు మళ్లీ పెరుగుతాయి. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన తీవ్ర ఇబ్బందుల పాలవుతారు. 


Also read: Godavari Floods: ఉగ్రరూపంతో గోదావరి, ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook