Venus Transit 2024: రాబోవు నెలలో ఈ రాశుల వారికి అదృష్టం రెట్టింపు..లగ్జరీ లైఫ్ ప్రారంభం..
Venus Transit 2024: ఎంతో ప్రాముఖ్యత కలిగిన శుక్ర గ్రహం జనవరి 18న ధనస్సు రాశిలోకి సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి శుభప్రదంగా మరికొన్ని రాశుల వారికి అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Venus Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్ర గ్రహాన్ని ప్రేమ, ఆకర్షణ, కళ, సాహిత్యం, అందం, సంపద, వైభవానికి కారకంగా సూచిస్తారు. అయితే ఇలాంటి గ్రహం జనవరి 18 గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ధనస్సు రాశిలోకి సంచారం చేసింది. శుక్ర గ్రహం వృశ్చిక రాశిని వదిలి ధనస్సు రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారిపై సానుకూల ప్రభావం పడబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత శుక్ర గ్రహం ఫిబ్రవరి 11న ధనస్సు రాశి నుంచి మరోసారి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రభావం కూడా అన్ని రాశుల వారిపై పడుతుంది. అయితే శుక్రుని సంచారం ఏయే రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
మేష రాశి:
మేష రాశి వారికి శుక్ర గ్రహ సంచారం కారణంగా అదృష్టం రెట్టింపు అవుతుంది. దీంతో వీరికి గౌరవం, ధైర్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఇక వైవాహిక జీవితంలో హెచ్చుతగ్గులు ఉన్నవారు ఈ సమయంలో పరిష్కరించుకోవడం చాలా మంచిది. ఇక వ్యాపారాలు చేస్తున్న వారికి భాగస్వామ్యుల మద్దతు లభించి మంచి లాభాలు పొందుతారు.
వృషభరాశి:
వృశ్చిక రాశి వారికి కూడా శుక్రుడి సంచారం ఎంతో శుభ్రంగా ఉంటుంది అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో మనసు ప్రశాంతంగా మారి సంతోషంగా ఉంటారు. ఇక వీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. ఈ సమయంలో అదృష్టం పెరగడం కారణంగా సంపాదనలో పెరుగుదల కనిపిస్తుంది. వ్యాపార రంగాల్లో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తాయి.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
మిథున రాశి:
మిథున రాశి వారికి ఈ సమయంలో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం చాలా శుభ్రంగా ఉంటుంది. ఇంతకు ముందు పెట్టుబడులు పెట్టిన వాటిలో లాభాలు కూడా పొందుతారు. ఇక దాంపత్య జీవితం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఈ సమయంలో విద్యార్థులకు బోధనలో పురోగతి లభిస్తుంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి శుక్రుడి సంచారం కారణంగా ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో కొత్త ఇల్లు లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.. కానీ ఈ సమయంలో తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి శుక్రుడి సంచారంతో పని ఒత్తిడి పెరిగే ఛాన్స్ కూడా ఉంది. దీంతోపాటు కర్కాటక రాశి వారు ఈ సమయంలో ప్రయాణాలు కూడా చేయవచ్చు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter