COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Holi 2024 Horoscope In Telugu: ఈ సంవత్సరం హోలీ పండుగ మార్చి 25వ తేదీన రాబోతోంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం హోలీ పండుగ ఎంతో ప్రత్యేకం కానుంది. ముఖ్యంగా ఈ పండగ రోజే శని గ్రహం కదలికలు జరపబోతోంది ఇదే క్రమంలో చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది. దీని కారణంగా వీటి ప్రభావం అన్ని రాశుల వారిపై సమానంగా పడబోతోంది. మార్చి 18వ తేదీన ఎంతో ప్రాముఖ్యత కలిగిన శని గ్రహం అస్తమించి దాదాపు సంవత్సరం పొడవునా అదే స్థితిలో ఉండబోతున్నాడు. దీని కారణంగా శని గ్రహం జరిపే కదలికల ప్రభావం మొత్తం మూడు రాశుల వారిపై ప్రత్యక్షంగా పడబోతోంది. అంతేకాకుండా శని గ్రహం శుభస్థానంలో ఉన్నవారికి ఊహించని లాభాలు కూడా కలుగుతాయి. అయితే ఈ శని కదలికల ప్రభావం కారణంగా ఏయే రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


తుల రాశి: 
కుంభ రాశిలో శని గ్రహం ఉదయించడం కారణంగా అలాగే ఈ దేశం లో చంద్రగ్రహణం ఏర్పడడం తో తులా రాశి వారికి హోలీ పండగ రోజున అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి గత కొన్ని సంవత్సరాల నుంచి నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలో సులభంగా పరిష్కారమవుతాయి. అలాగే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది వీరికి శని అనుగ్రహం లభించి వృత్తిపరమైన పనుల్లో కూడా ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయంలో ప్రమోషన్స్ లభించే అవకాశాలు ఉన్నాయి.


ధనుస్సు రాశి: 
హోలీ పండుగ శుభ సందర్భంగా ఏర్పడే ప్రత్యేక ప్రభావం కారణంగా ధనస్సు రాశి వారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి శని దేవుడి అనుగ్రహం లభించి, ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. అంతేకాకుండా సమాజంలో నిమగ్నమై ఉన్నవారికి మంచి పేరు లభిస్తుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి మీ బాస్ లేదా సహోద్యోగుల సపోర్టు లభించి, జీతాలు కూడా పెంచుకోగలుగుతారు. అలాగే ఈ సమయంలో మీరు విదేశీ పర్యటన కూడా చేసే అవకాశాలు ఉన్నాయి.


Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!


వృషభ రాశి: 
వృషభ రాశి వారికి శని జరిపే కదలికల కారణం చంద్రగ్రహణ సమయంలో వీరికి ఎంతగానో మేలు జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో వీరికి ఆదాయం రెట్టింపవడమే కాకుండా ఇంతకుముందు అప్పుగా ఇచ్చిన డబ్బులు కూడా పొందుతారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ హోలీ పండుగ సమయాల్లో శుభవార్తలు వింటారు. అంతేకాకుండా వీరికి జీవితంలో వస్తున్న కష్టాలు క్రమంగా తగ్గిపోయే అవకాశాలు అలాగే ఆదాయంలో అనేక మార్పులు రావచ్చు.


Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter