Eid ul fitr 2022: ఈదుల్ ఫిత్ర్ లేదా రంజాన్ పండుగ ఎప్పుడనేది పూర్తిగా చంద్రుడి దర్శనంపైనే ఆధారపడి ఉంటుంది. మరి చంద్ర దర్శనం ఇండియాలో ఎప్పుడు, సౌదీ అరేబియాలో ఎప్పుడు ఏ సమయంలో చేయాలనేది తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం ప్రజలకు అత్యంత ప్రాచుర్యమైన పండుగ రంజాన్. లేదా ఈదుల్ ఫిత్ర్. పవిత్ర రంజాన్ పండుగ చివరిరోజు జరుపుకునే పండుగ ఇది. సూర్యోదయం ముందు నుంచి సూర్యాస్తమయం వరకూ నిష్టగా ఉపవాసాలు ఆచరించే నెల. ఉపవాసం ఆరంభంలో అంటే సూర్యోదయానికి ముందు తినేది సెహ్రీ అయితే..సూర్యాస్తమయానికి ఉపవాసం విడిచే ప్రక్రిను ఇఫ్తార్‌గా పిలుస్తారు. ఈ నెలలో ముస్లింలు దాన ధర్మాలు అత్యధికంగా చేస్తారు. ఈ నెలలోనే ముస్లింలు తమ సంపాదనపై జకాత్ లేదా ట్యాక్స్ తీసి పేదలకు పంచిపెడతారు. ఈ నెలలోనే పేదలకు ఫిత్రా ఇస్తారు.


ఫిత్రా అంటే ఏమిటి, ఈదుల్ ఫిత్ర్ అని ఎందుకంటున్నారు


రంజాన్ పండుగకు మరో పేరు ఈదుల్ ఫిత్ర్. అంటే ఫిత్రా ఇచ్చే పండుగ. ఫిత్రా అంటే ఓ ప్రత్యేకమైన దానం. పండుగకు ముందు రోజు..ఇంట్లోని కుటుంబసభ్యుల సంఖ్యను బట్టి...అన్ని కిలోల బియ్యం లేదా గోధుమలు పేదలకు దానంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది విధి. అంటే ఓ కుటుంబంలో ముగ్గురు ఉంటే..ఒక్కొక్కరికి 2.60 కిలోల చొప్పున మనం ఏదైతే తింటున్నామో అదే బియ్యం లేదా అదేరకం గోధుమల్ని తీయాలి. ముగ్గురు కుటుంబసభ్యులుంటే 7.8 కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కుటుంబసభ్యుల సంఖ్యను..2.60 కిలోలతో గుణించి..తీయాలి. దీన్నే ఫిత్రా అంటారు. ఇది ఇవ్వకపోతే పండుగ జరుపుకోవడంలో అర్ధమే లేదు. 


చంద్రుడిని ఎప్పుడు ఏ సమయంలో చూస్తారు


సౌదీ దేశాల్లో ఏప్రిల్ 2వ తేదీన, ఇండియాలో ఏప్రిల్  3వ తేదీన రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. తిరిగి 29 రోజుల తరువాత చంద్రుని చూసి ఉపవాస దీక్షలు ముగుస్తారు. 30వ రోజున ఈదుల్ ఫిత్ర్ పండుగ జరుపుకుంటారు. 29 వ రోజున నెలపొడుపు కన్పించకపోతే..30 రోజులు ఉపవాసాలు పూర్తి చేసి..31వ రోజున పండుగ జరుపుకోవాలి. ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం సౌదీలో చంద్రదర్శనం అయుంటే..ఇవాళ అంటే మే 1న పండుగయ్యేది. సౌదీలో చంద్రదర్శనం కాలేదు కాబట్టి మే 2వ తేదీన అక్కడ ఈదుల్ ఫిత్ర్ జరుపుకుంటారు. ఇక ఇండియాలో ఏప్రిల్ 3న ప్రారంభమైంది కాబట్టి 29 రోజులకు అంటే ఇవాళ మే 1వ తేదీన చంద్రుడిని చూడాలి. చంద్రదర్శనమైతే..ఇండియాలో కూడా మే 2నే పండుగ ఉంటుంది. లేకపోతే మే 3న కచ్చితంగా జరుపుకుంటారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.