February Rasi Phalalu 2024: ఫిబ్రవరి నెలలో ఊహించని లాభాలను పొందబోయే రాశులవారు వీరే..మీ రాశి కూడా ఉందా?
February Rasi Phalalu 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహాలు ఫిబ్రవరి నెలలో సంచారం చేయబోతున్నాయి. కాబట్టి కొన్ని రాశులవారికి ఈ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది.
February Rasi Phalalu 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం రాశి సంచారం చేస్తుంది. గ్రహాలు ప్రత్యేక సమయాల్లో సంచారాలతో పాటు తిరోగమనాలు చేస్తాయి. అయితే ఈ సంచారాలకి ఫిబ్రవరి నెల ఎంతో ప్రాముఖ్యమైనదిగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇదే నెలలో జ్యోతిష్య శాస్త్రంలో శుభ గ్రహాలుగా పేరు పొందిన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ఫిబ్రవరి ప్రారంభ సమయంలోనే ఎంతో ప్రాముఖ్యతకలిగిన కొన్ని గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. నెల ప్రారంభంలోనే బుధ గ్రహం మకరరాశిలో, ఫిబ్రవరి 12న మకరరాశిలో శుక్ర గ్రహం సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
మేషరాశి:
మేష రాశి వారికి ఫిబ్రవరి నెల చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అన్ని గ్రహాల సంచారం కారణంగా ఈ రాశివారికి ఉద్యోగాలు, వ్యాపారాల్లో విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశివారికి జాతకంలో 10వ స్థానంలో బుధాదిత్య, ఆదిత్య మంగళ యోగాలు ఏర్పడబోతున్నాయి. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించిన వారికి ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే సమాజంలో మీ ప్రభావం పెరిగడం కారణంగా కీర్తి, ప్రతిష్టలు కూడా రెట్టింపు అవుతాయి.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నత చదువులు చదువలనుకునేవారి కోరికలు కూడా నెరవేరబోతున్నాయి. ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి ఈ సమయంలో కొంత ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు వీరికి మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి పెరిగే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి నెలలో ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి.
కన్యారాశి:
కన్యారాశి వారికి కూడా ఫిబ్రవరి నెలల జరిగే గ్రహాల సంచారాల కారణంగా ఊహించని శుభవార్తలు వింటారు. ముఖ్యంగా పిల్లల నుంచి ఆనందాన్ని కూడా పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే కుటుంబంలో వివాహ శుభకార్యాలు జరగడం వల్ల ఫ్యామిలీతో ఎంతో ఉత్సహంగా ఉంటారు. విద్యకు సంబంధించిన ఏ పోటీ పరీక్షల్లోనైనా మీరు సులభంగా విజయం సాధిస్తారు. ప్రేమ జీవితం గడుపుతున్నవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
మకరరాశి:
మకర రాశి వారికి సూర్య, బుధ, కుజ గ్రహాల సంచారం కారణంగా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. ఈ సమయంలో పురోభివృద్ధితో పాటు అనేక రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఉద్యోగాలు చేస్తున్న వారు ఈ నెలలో ప్రమోషన్ కూడా పొందవచ్చు. ఈ నెలలో మీరు మీ తండ్రి, పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తులు కూడా పొందుతారు. ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter