Feng Shui: ఫెంగ్ షుయ్ ప్రకారం...డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే దీనిని ఇంట్లో ఉంచుకోండి!
Feng Shui: చైనీస్ వాస్తు శాస్త్రంలో అపారమైన డబ్బును పొందడానికి కొన్ని చిట్కాలు చెప్పబడ్డాయి. ఇందులో ఒకటే ఇంట్లో ఫిష్ అక్వేరియం ఉంచడం.
Feng Shui Tips for Fish Aquarium: ప్రతి ఒక్కరూ తమ కుటుంబం అష్టఐశ్వర్యాలు, సుఖ సంతోషాలతో కళకళ్లాడాలని కోరుకుంటారు. అయితే వ్యక్తి యెుక్క కర్మలు, వాస్తు దోషాలు, జాతకంలోని గ్రహాలు చాలాసార్లు ఆటంకాలుగా మారుతాయి. మీపై ఈ ప్రతికూల ప్రభావాలను నివారించడానికి చిట్కాలు ఆస్ట్రాలజీ, వాస్తు శాస్త్రం, చైనీస్ వాస్తు శాస్త్రం ఫెంగ్ షుయ్‌లో (Feng Shui) చెప్పబడ్డాయి. ఈ పరిహారాలు మీ ఇంటిలోని ప్రతికూల శక్తిని తొలగించడమే కాకుండా ఆనందం, ఐశ్వర్యాన్ని తీసుకొస్తాయి.
ఫెంగ్ షుయ్‌లో ఫిష్ అక్వేరియం రెమెడీ
ఫెంగ్ షుయ్‌లో ఫిష్ అక్వేరియం (Fish Aquarium) చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇంట్లో ఫిష్ అక్వేరియం ఉండటం చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఫెంగ్ షుయ్ ప్రకారం, మీరు ఇంట్లో చేపల అక్వేరియం ఉంచినట్లయితే.. అందులో చేపల సంఖ్య 9 ఉంచండి. ఇందులో 8 నలుపు చేపలు, 1 బంగారు రంగు గల చేపను ఉంచండి. ఈ చేపల కలయిక అక్వేరియంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది.
ఈ దిశలో అక్వేరియం ఉంచండి
మీ డ్రాయింగ్ రూమ్‌లో 9 చేపలతో కూడిన అక్వేరియాన్ని ఉంచండి. దానిని గదికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచండి. అలా కుదరని పక్షంలో ఇంటి ప్రధాన ద్వారం ఎడమవైపున ఫిష్ అక్వేరియం ఉంచడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి డబ్బు భారీగా వస్తుంది. అయితే పొరపాటున బెడ్‌రూమ్‌లో అక్వేరియాన్ని పెట్టకండి. దీనిని అరిష్టంగా భావిస్తారు. చేపల అక్వేరియం చుట్టూ ఎటువంటి దుమ్ము, ధూళి లేకుండా చూసుకోండి.
Also Read: Guru Vakri 2022: మీనంలో బృహస్పతి తిరోగమనం.. ఈ 3 రాశులవారికి కష్టకాలం..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook