Feng Shui Tips: ఫెంగ్‌షుయీ అనేది చైనాకు చెందిన వాస్తుశాస్త్రం. చాలామంది భారతీయులు దీన్ని విశేషంగా నమ్ముతారు. ఫెంగ్‌షుయీ ప్రకారం ఇంట్లో వస్తువులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో కొన్ని సూచనలున్నాయి. ఇందుకు విరుద్ధంగా జరిగితే ఏం జరుగుతుందనేది స్పష్టంగా ఉంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫేంగ్‌షుయీ ప్రకారం ఇంట్లో బీరువా లేదా అల్మారా ఎక్కడ, ఎలా ఉంచాలనేది స్పష్టంగా ఉంది. అల్మారా తెరిచిన తరువాత మూయాల్సిన పద్ధతి కూడా వివరించారు. అల్మారాలోని వస్తువుల్ని ఎలా ఉంచాలో కూడా ఫేంగ్‌షుఈలో ఓ ప్రత్యేక విధానముంది. ఈ విధానం ఎనర్జీ, సర్వోన్నత వృద్ధికి చాలా అవసరమట. తెరిచిన అల్మారాలో పుస్తకాలుంచితే..ఇది అశుభమని నమ్మకం. లేదా దుష్ట శక్తి ఉదయిస్తుందట.


అల్మారా తెరిచి ఉంచొద్దు


ఫేంగ్‌షుయీ ప్రకారం ఆఫీసులో లేదా ఇంట్లో పుస్తకాలున్న అల్మారా లేదా బీరువా తెరిచి ఉంటే..కత్తి గుచ్చుకున్నట్టుగా అర్ధమట. ఇలా ఉంటే నెగెటివ్ ఎనర్జీ ఎంత ఉత్పన్నమౌతుందంటే..అక్కడున్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం నాశనమైపోతుంది. అందుకే ఫేంగ్‌షుయీలో ఈ విషయమై కఠినమైన, స్పష్టమైన సూచనలున్నాయి. ఇంట్లో లేదా ఆఫీసులో బీరువా తెరిచి ఉంచవద్దని ఉంది. ఈ నియమాన్ని పాటించకపోతే తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారని ఉంది. అలాంటి కుటుంబంలో సభ్యులు ఒత్తిడిలో ఉంటారు. ఫేంగ్‌షుయీ ఉపాయాల ప్రకారం అల్మారా తలుపులు మూసి ఉంచాలి. 


విద్యుత్ పరికరాలు పశ్చిమ దిశలో


చాలామంది ఇళ్లలో ఆధునిక సౌకర్యాలకు సంబంధించిన సామగ్రి ఉంచుతుంటారు. ఇందులో విద్యుత్ పరికరాలు కూడా ఉంటాయి. ఇంట్లో అలంకరణకై ఈ వస్తువుల్ని సరైన రీతిలో ఉంచాలి. తద్వారా ఇంటి పాజిటివ్ ఎనర్జీ నష్టపోకుండా ఉంటుంది. విద్యుత్ పరికరాల్ని పశ్చిమ గోడ లేదా పశ్చిమ దిశలోనే సెట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంటి కుటుంబ సభ్యులకు సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. 


మంచానికి దూరంగా టీవీ


విద్యుత్ ఉపకరణాలను ఇంటి పశ్చిమ దిశలో ఉంచడం వల్ల ప్రయోజనముంటుంది. బెడ్రూమ్‌లో టీవీ ఉంచాల్సి వస్తే..మంచానికి దూరంగా ఉంచాలి. మంచానికి తిన్నంగా ఉంచకూడదు. ఎందుకంటే టీవీ స్క్రీన్ అనేది అద్దంలా పనిచేస్తుంది. దీనివల్ల దాంపత్యంలో బేధాభిప్రాయాలు తలెత్తుతాయి. ఫేంగ్ షుయీలో అశుభంగా భావిస్తారు. బెడ్రూమ్‌లో టీవీ ఉంటే చూసిన తరువాత కప్పేయాలి.


Also read: Budh Margi 2022: సంచారంలో బుధుడు.. అక్టోబర్ 26 వరకు ఈ రాశుల వారి జీవితాల్లో వెలుగులు../p>


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook