హిందూమత విశ్వాసాల ప్రకారం సాముద్రిక శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. అంటే శరీరంలోని వివిధ అవయవాల నిర్మాణం, ఆకారాన్ని బట్టి ఆ వ్యక్తి భవిష్యత్ చెప్పే శాస్త్రం. చాలామంది విశేషంగా అనుసరించే శాస్త్రమిది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా వ్యక్తి ముఖం, శరీరంలోని వివిధ అంగాల ఆకారం, రంగుని బట్టి చెప్పవచ్చు. ఎవరైనా వ్యక్తి చేతిపై ఉన్న రేఖల్ని బట్టి అతడి అదృష్టం అంచనా వేయవచ్చు. అదే విధంగా అతడి వేళ్ల ఆకారం బట్టి అతడికి సంబంధించిన భవిష్యత్ చెప్పవచ్చు. చేతి రేఖల్లో ఎలాగైతే వ్యక్తి భవిష్యత్ దాగుందో..అదే విధంగా చేతి వేళ్లు కూడా వ్యక్తి గురించి చాలా విషయాలు చెబుతాయి. వేళ్ల ఆకారం, నిర్మాణం ఆ వ్యక్తి చరిత్ర, స్వభావాన్ని, భవిష్యత్‌ను చెబుతాయి.


చూపుడు వేలు


చేతివేళ్లన్నింటిలోనూ ఇదే శక్తివంతమైందిగా భావిస్తారు. ఈ వేలితో మొక్కలు, పళ్లు, చెట్లవైపు చూపిస్తే..అవన్నీ పాడైపోతాయి. ఈ వేలితో బ్రష్ చేయడం కూడా నిషిధ్దం. ఎందుకంటే ఇది శక్తివంతమైన వేలు. ఈ వేలితో బ్రష్ చేయడం వల్ల పళ్లలో సమస్యలొస్తాయి. ఆధ్యాత్మికంగా ఆ వ్యక్తి ఎంత శక్తివంతుడనేది ఈ వేలుని బట్టి చెప్పవచ్చు. 


మధ్య వేలు


మధ్యవేలుని బట్టి ఆ వ్యక్తి సామర్ధ్యం, చదువు, ఉద్యోగాన్ని అంచనా వేయవచ్చు. ఈ వేలు ఎంత పొడుగ్గా, తిన్నగా ఉందో ఆ వ్యక్తి అంత వేగంగా కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుతాడు. కానీ ఒకవేళ ఈ వేలు వంకరగా లేదా లావుగా లేదా ఉంగరం వేలు కంటే చిన్నగా ఉంటే..వ్యక్తి కెరీర్ అంతా చిక్కుల్లో ఉంటుందని తెలుస్తోంది. సాముద్రికం ప్రకారం ఈ వేలిపై పుట్టుమచ్చ ఉండకూడదు.


చిటికెన వేలు


చిటికెన వేలును బట్టి ఆర్థిక పరిస్థితి , బుద్ధి గురించి తెలుస్తుంది. ఈ వేలు ఎంత పొడుగ్గా ఉంటే..ఆ వ్యక్తి అంత తెలివైనవాడవుతాడు. కానీ ఒకవేళ ఈ వేలు వంకరగా లేదా చిన్నగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఎత్తుపల్లాలుంటాయి. చాలా సందర్భాల్లో ఈ వ్యక్తులు తమ నిర్ణయాల కారణంగా చిక్కుకుపోవచ్చు.


ఉంగరం వేలు


ఉంగరం వేలుని బట్టి వ్యక్తి ఆలోచనలు, భావోద్వేగాలు, ఆరోగ్యం, జీవితంలో ఎంత కీర్తి సంపాదిస్తాడనేది తెలుస్తుంది. ఈ వేలు ఎక్కువ పొడుగ్గా ఉంటే ఆ వ్యక్తికి కోపం ఎక్కువని అర్ధం. దుస్సాహసిగా కూడా చేస్తాయి. ఈ వేలు ఒకవేళ మధ్యస్థ ఆకారంలో ఉంటే చాలా మంచిదట. సాముద్రిక శాస్త్రం ప్రకారం చూపుడు వేలు కంటే ఈ వేలు పొడుగ్గా ఉంటే..పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి.


Also read: Shani Dev: శని గ్రహం ఈ రాశుల్లోకి సంచారం చేస్తే.. 12 రాశులవారికి అన్ని శుభాలే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook