Lunar Eclipse 2023: 2023 మేలో ఈ ఏడాదిలోని తొలి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. మే 5వ తేదీ శుక్రవారం నాడు తొలి చంద్ర గ్రహణం వైశాఖ పౌర్ణిమ నాడు ఏర్పడనుండటం విశేషం కానుంది. ఈ చంద్ర గ్రహణాన్ని పాక్షిక చంద్ర గ్రహణమంటున్నారు. ఉప ఛాయా చంద్ర గ్రహణం సాధారణంగా కంటికి కన్పించదు. అయితే మొత్తం 12 రాశులపై స్పష్టంగా ఉండనుంది. మేలో ఏర్పడనున్న చంద్ర గ్రహణం ప్రభావం ముఖ్యంగా 4 రాశుల జీవితాల్లో కల్లోలం రేపనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యం ప్రకారం తొలి చంద్ర గ్రహణం ప్రభావం ఆరోగ్యం, భవిష్యత్ పధకాలను స్పష్టంగా అంచనా వేయవచ్చు. ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం ఎప్పుడు, ఎక్కడ ఎర్పడనుంది, ఏయే రాశులపై నెగెటివ్ ప్రభావం పడనుందో తెలుసుకోవచ్చు. ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం మే 5వ తేదీ రాత్రి 8.45 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 1 గంటకు పూర్తవుతుంది. అంటే గ్రహణ కాలం దాదాపుగా 4 గంటల 15 నిమిషాలుంటుంది. 


ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణాన్ని పాక్షిక చంద్ర గ్రహణంగా పిలుస్తున్నారు. ఈ క్రమంలో సూతకకాలం ఉండదు. చంద్ర గ్రహణం సూతక కాలం 9 గంటల ముందు నుంచే మొదలవుతుంది. పాక్షిక చంద్ర గ్రహణం ఆసియా, యూరప్ మహాద్వీపం, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, పసిఫిక్, అట్లాటింక్, హిందూ మహా సముద్రం ప్రాంతాల్లో ఉంటుంది. 


చంద్ర గ్రహణం ప్రభావం ఈ 4 రాశులపై


మేష రాశి


మేష రాశి జాతకులకు మే నెలలో ఏర్పడనున్న తొలి చంద్ర గ్రహణం ప్రభావంతో  తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. ఫలితంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. భవిష్యత్ విషయంలో ఆందోళనగా ఉంటారు. కాస్త జాగ్రత్తగా ఉండాలి.


వృషభ రాశి


చంద్ర గ్రహణం కారణంగా ఈ రాశి జాతకుల దాంపత్య జీవితంపై అద్భుత ప్రభావం కన్పిస్తుంది. జీవిత భాగస్వామితో వాద వివాదాలు ఏర్పడతాయి. భవిష్యత్ ప్రణాళికలు చెడిపోవచ్చు. జాగ్రత్తగా ఉండాలి.


కర్కాటక రాశి


జ్యోతిష్యం ప్రకారం మే నెలలో ఏర్పడనున్న తొలి చంద్ర గ్రహణం ప్రభావం ఆరోగ్యంపై దుష్పరిణామం చూపనుంది. అంతేకాకుండా..ఈ జాతకులకు సుఖ సంతోషాలు లోపిస్తాయి. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. 


తుల రాశి


జ్యోతిష్యం ప్రకారం చంద్ర గ్రహణం తులా రాశి జాతకుల ఆరోగ్యంపై ప్రభావితం చూపించనుంది. అంతేకాకుండా..కుటుంబ జీవితంలో అశాంతి ఉంటుంది. ఆర్ధిక ఇబ్బందులు ఎదురౌతాయి. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. 


Also  read: Mercury transit 2023: బుధ గ్రహ గోచారంతో త్రిగ్రహ యోగం, రేపట్నించి ఆ 3 రాశులకు తీవ్ర ఇబ్బందులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook