Chandra Grahan 2024 effect: హోలీ రోజే చంద్రగ్రహణం.. ఈ 3 రాశులకు పట్టనున్న దరిద్రం..
Lunar Eclipse 2024 effect: మార్చి నెల చివరిలో తొలి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. దీని ప్రభావం అన్ని రాశులపై ఖచ్చితంగా ఉంటుంది. అయితే గ్రహణ సమయంలో ముఖ్యంగా మూడు రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Chandra Grahan 2024 Negative Impact: ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం ఫాల్గుణ పూర్ణిమ నాడు ఏర్పడబోతుంది. పైగా అదే రోజు హోలీ కూడా వస్తుంది. ఈ గ్రహణం మార్చి 25వ తేదీ సోమవారం నాడు సంభవించబోతుంది. అయితే ఈ గ్రహణం మనదేశంలో కనిపించకపోయినా.. దీని ప్రభావం మాత్రమే ప్రజలందరిపై కనిపిస్తుంది. అయితే ఈ చంద్రగ్రహణ సమయంలో కొన్ని రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
వృశ్చికరాశి
వృశ్చిక రాశి వారు చంద్రగ్రహణం కారణంగా చాలా సమస్యలను ఎదుర్కోంటారు. మీ కెరీర్ లో అనుకున్నంత పురోగతి ఉండదు. ఈ సమయంలో కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. వీలైతే వివాదాలకు దూరంగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. మీ కష్టానికి తగిన గుర్తింపు దక్కదు. వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తుతాయి.
సింహరాశి
ఈ ఏడాది ఏర్పడబోయే చంద్రగ్రహణం వల్ల సింహరాశి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోంటారు. కెరీర్ లో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీ ప్రేమలో అనేక సమస్యలు వస్తాయి. భార్యభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది.
మిధునరాశి
చంద్రగ్రహణం వల్ల మిథునరాశి వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ప్రేమికుల మధ్య సమస్యలు రావచ్చు. వ్యాపారులు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎటువంటి పెట్టుబడులు పెట్టొద్దు. మీ ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Budhaditya Raja Yoga: శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పాటు.. ఈ రాశులవారికి లాభాలే లాభాలు!
Also Read: Mahashivratri 2024 today: మహాశివరాత్రి నాడు త్రిగ్రాహి యోగం.. ఈ 3 రాశులకు శివుడి అనుగ్రహం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి