Sravana Somavaram 2022: మొదటి శ్రావణ సోమవారం రోజే 3 శుభ యోగాలు.. ముహూర్తం, పూజా విధానం గురించి తెలుసుకోండి
Sravana Somavaram 2022: రేపే మెుదటి శ్రావణ సోమవారం. ఈ రోజున మూడు యోగాలు ఏర్పడబోతున్నాయి. ముహూర్తం, శుభ యోగం, పూజా విధానం గురించి తెలుసుకోండి.
First Sravana Somavaram 2022 Yoga: శ్రావణ మాసం ఇప్పుటికే మెుదలైంది. హిందువులకు ఎంతో పవిత్రమైన ఈ మాసంలో శివుడిని పూజిస్తారు. ఈ మాసంలోని శ్రావణ మెుదటి సోమవారానికి (First Sravana Somavaram 2022) విశేష ప్రాధాన్యత ఉంది. ఇది ఈ ఏడాది రేపు అంటే జూలై 18న వస్తుంది. ఈ రోజున ఉపవాసం చేస్తూ..శివారాధన చేస్తారు భక్తులు. దీంతో శివుడు ప్రసన్నుడై భక్తుల కోరికలను తీరుస్తాడని నమ్ముతారు. రాబోయే శ్రావణ మాసం తొలి సోమవారం రోజున మూడు యోగాలు ఏర్పడుతున్నాయి. అయితే మొదటి శ్రావణ సోమవారం ముహూర్తం, శుభ యోగం మరియు పూజా విధానాన్ని గురించి తెలుసుకుందాం.
ఒకరోజు 3 యోగాలు
రవి యోగం
18 జూలై 2022న శ్రావణంలోని మొదటి సోమవారం రవియోగం ఏర్పడుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రవియోగంలో శివుని పూజించేటప్పుడు, మహామృత్యుంజయ జపం చేస్తే భయం తొలగిపోయి సర్వ బాధల నుండి విముక్తి లభిస్తుంది.
మౌన పంచమి యోగం
మౌన పంచమి యోగం కూడా మొదటి శ్రావణ సోమవారం రోజునే వస్తుంది. ఈరోజున శివునితో పాటు నాగదేవతను కూడా పూజిస్తారు. ఈ రోజున మౌన వ్రతం పాటించడం వల్ల మానసిక దృఢత్వం పెంపొందుతుంది.
శోభన్ యోగం
శ్రావణ మాసం మొదటి సోమవారం నాడు శోభన్ యోగంలో ఉపవాసం, పూజలు, జపం చేయడం వల్ల అదృష్టంతోపాటు అపారమైన సంపద మీ సొంతం అవుతుంది.
ముహూర్తం
రవి యోగం ప్రారంభం - 18 జూలై 2022, మధ్యాహ్నాం 12.24
రవియోగం ముగింపు - 19 జూలై 2022, ఉదయం 5.35 గంటలకు
శోభన్ యోగా ప్రారంభం - 17 జూలై 2022, మధ్యాహ్నాం 05:49
శోభన్ యోగా ముగింపు - 18 జూలై 2022, మధ్యాహ్నాం 03:26
అభిజీత్ ముహూర్తం - 18 జూలై 2022, ఉదయం 11.47 నుండి మధ్యాహ్నం 12.41 వరకు.
పూజా విధానం
శ్రావణ సోమవారం రోజున సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి. తర్వాత శుభ్రమైన బట్టలు ధరించాలి. అనంతరం ఉపవాస దీక్ష పాటిస్తూ.. శివలింగానికి గంగాజలంతో జలాభిషేకం చేయండి. లింగానికి పంచామృతాన్ని పూయండి. ఈ రోజున పరమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే అపారమైన సంపదను పొందుతారు. 21 బిల్వ పత్రాల్లో గంధంతో 'ఓం నమః శివయ్' అని రాయండి. మంత్రాన్ని జపిస్తూ..ఒక్కొక్క పత్రాన్ని సమర్పించండి. శివలింగాన్ని తెల్లటి చందనం మరియు పూలతో అలంకరించండి, డాతుర, శమీ పత్ర, అక్షింతలు, కుంకుమ, పాన్, తమలపాకులు, పరిమళ ద్రవ్యాలు మొదలైన వాటిని శివలింగానికి సమర్పించండి. పండ్లు మరియు స్వీట్లు దేవుడి ముందు పెట్టిన తరువాత శివ చాలీసా పఠించండి. శుభ యోగంలో శివమంత్రాలను జపించండి. అనంతరం శ్రావణ సోమవారం వ్రత కథను వినండి. చివరగా హారతి ఇచ్చి ప్రజలకు ప్రసాదాన్ని పంచండి.
Also Read: Sravana Somavaram 2022: రేపే శ్రావణ మాసం తొలి సోమవారం, వ్రత కథను తెలుసుకోండి
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook