surya grahan 2023: సూర్యగ్రహణంతో ఈ రాశులకు మహార్దశ... ఇందులో మీ రాశి ఉందా?
Solar eclipse 2023: ఏప్రిల్ లో తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఇది భారతదేశంలో కనిపిస్తుందా, సూతకం చెల్లుతుందా, ఏయే రాశులవారికి ఇది కలిసి వస్తుందో తెలుసుకుందాం.
When is surya grahan in India: ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20, గురువారం నాడు సంభవించబోతుంది. భూమి మరియు సూర్యుడి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. తొలి సూర్యగ్రహణం 7.4 నిమిషాల నుండి 12.29 వరకు ఉంటుంది. ఈ ఏడాది ఏర్పడబోయే మెుదటి సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు, కాబట్టి సూతకం కూడా చెల్లదు.
సూర్యగ్రహణం యొక్క శుభ ప్రభావం
2023లో ఏర్పడబోయే తొలి సూర్యగ్రహణం వృషభ, మిథున, ధనుస్సు రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఈ గ్రహణం కారణంగా వృషభరాశి వారు కొత్త జాబ్ పొందుతారు. మీరు రుణ విముక్తి పొందుతారు. జీవితంలో ఆనందం మరియు శాంతి నెలకొంటుంది. మిథునరాశి వారు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. సంతానప్రాప్తి కలుగుతుంది.ఈ సూర్యగ్రహణం ధనుస్సు రాశి వారికి ధనలాభాన్ని ఇస్తుంది. మీరు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది.
సూర్యగ్రహణం యొక్క ప్రతికూల ప్రభావం
సూర్యగ్రహణం సమయంలో సూర్యుడు మేషరాశిలో ఉంటాడు. దీంతో మేషరాశి వారి గందరగోళ పరిస్థితిని ఎదుర్కోంటారు. సింహ రాశి వారిపై కూడా సూర్యగ్రహణం నెగిటివ్ ప్రభావం చూపుతుంది. విద్యా, ఉద్యోగ రంగాలలో అనేక సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. కన్యా రాశి వారు మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమయంలో మీ మాటలను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook