Solar Eclipse 2023: ఏప్రిల్ 20 నుంచి ఈ 4 రాశులకు చెడ్డ రోజులు ప్రారంభం.. ఇందులో మీ రాశి ఉందా?
Solar Eclipse 2023: ఈ నెల 20న మెుదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ ఖగోళ సంఘటన నాలుగు రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఆ దురదృష్ట రాశులేంటోతెలుసుకుందాం.
Solar Eclipse 2023: ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు రానున్నాయి. 2023 తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 20, ఉదయం 7.4 నుండి ప్రారంభమై మధ్యాహ్నం 12.29 వరకు ఉంటుంది. ఇది భారతదేశంలో కనిపించదు. సరిగ్గా 15 రోజుల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడల్లా సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం ఖగోళ సంఘటనలు అయినప్పటికీ జ్యోతిషశాస్త్రంలో గ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఈ గ్రహణం నాలుగు రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
సూర్యగ్రహణం ఈ రాశులవారిపై ప్రతికూల ప్రభావం
మేషం
సూర్యగ్రహణం ఈ రాశి వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. మేషరాశిలో మాత్రమే సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మీరు కెరీర్ లో అనేక సమస్యలను ఎదుర్కోవల్సి రావచ్చు. మీరు ఈ సమయంలో మానసిక ఒత్తిడికి గురవుతారు.
కన్య
ఈ రాశి వారికి సూర్యగ్రహణం శుభప్రదం కాదు. కన్యారాశి వారు వివాదంలో చిక్కుకుంటారు. మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నష్టాలను చవిచూస్తారు. మీకు కాలం అస్సలు కలిసిరాదు. మీ కోరికలు ఏవీ ఈ సమయంలో నెరవేరవు.
సింహం
సింహరాశిపై సూర్యగ్రహణం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. మీ కెరీర్ లో ఆటంకాలు ఏర్పడతాయి. మీరు వ్యాపారంలో భారీగా నష్టాలను చవిచూస్తారు.
మకరరాశి
సూర్యగ్రహణం వల్ల మకర రాశి వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మీ ఖర్చులు భారీగా పెరుగుతాయి. మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. ధన నష్టం కలగవచ్చు. ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.
Also Read: Viprit Rajyog After 50 years: 50 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగం.. ఈ 4 రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook