Grah Gochar 2023: జనవరిలో గ్రహాల గమనంలో పెను మార్పు.. ఈ 4 రాశులకు ఊహించనంత ధనం..
Planet Changes 2023: కొత్త ఏడాదిలో గ్రహాల గమనంలో పెను మార్పులు రానున్నాయి. దీని కారణంగా నాలుగు రాశులవారికి లాభం చేకూరనుంది.
Five Planet Transit In January 2023: జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఒక గ్రహం తన రాశిని మార్చినప్పుడల్లా దాని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. జనవరిలో 5 గ్రహాల గమనంలో మార్పు రానుంది. ముందుగా జనవరి 14న సూర్యభగవానుడు తన రాశిని మార్చనున్నాడు. దీని తర్వాత శనిదేవుడు జనవరి 17న కుంభ రాశిలోకి వెళ్లనున్నాడు. జనవరి 22న శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతోపాటు బుధుడు, అంగారకుడు మార్గంలోకి రానున్నాయి. వీటి సంచారాల వల్ల నాలుగు రాశులవారు లాభపడనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
మేష రాశిచక్రం (Aries): గ్రహాల కదలికలో మార్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే శని దేవుడు మీ జాతకంలో 11వ ఇంట్లోనూ, సూర్యుడు మీ రాశి నుండి పదవ ఇంట్లోనూ సంచరిస్తారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
వృషభ రాశి (Taurus): వృషభ రాశి వారికి ఐదు గ్రహాల కదలికలలో మార్పులు శుభప్రదంగా ఉంటాయి. ఎందుకంటే సూర్యదేవుడు మీ జాతకంలో తొమ్మిదవ ఇంట్లో సంచరించగా, శనిదేవుడు 11వ ఇంట్లో సంచరిస్తాడు. అందుకే ఈ సమయంలో మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లభించడంతోపాటు జీతం కూడా పెరుగుతుంది. మీరు పూర్వీకుల ఆస్తి నుండి లాభం పొందుతారు.
మకర రాశిచక్రం (capricorn): గ్రహాల సంచారం మీకు ఆర్థికంగా లాభిస్తుంది. శని దేవుడు మీ జాతకంలోని రెండవ ఇంట్లో సంచరించబోతున్నాడు. గ్రహాల రాజు సూర్యదేవుడు మీ రాశి యెుక్క లగ్న గృహంలో సంచరించనున్నాడు. విదేశాల్లో చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. శని సాడే సతి మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
మిథునం రాశిచక్రం (Gemini): ఐదు గ్రహాల కదలికలలో మార్పులు మీకు శుభప్రదంగా ఉంటాయి. ఎందుకంటే శని దేవుడు మీ రాశి నుండి తొమ్మిదో ఇంట్లో సంచరించనున్నాడు. మరోవైపు సూర్యభగవానుడు మీ జాతకంలో ఎనిమిదో ఇంట్లోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో మీ అదృష్టం పెరుగుతుంది. కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం. మీరు బిజినెస్ విస్తరించే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.