Planet transits in January 2023: జనవరి నెలలో 5 గ్రహాల గమనంలో మార్పు రానుంది. ఇందులో కర్మ దాత అయిన శనిదేవుడు మొదటగా జనవరి 17న కుంభరాశిలో సంచరిస్తాడు. మరోవైపు జనవరి 14న గ్రహాల రాజు సూర్యభగవానుడు ధనుస్సు రాశి నుంచి మకరరాశిలోకి, శుక్రుడు జనవరి 22న కుంభరాశిలోకి ప్రవేశించనున్నారు. దీని తర్వాత జనవరి 12న కుజుడు, జనవరి 18న బుధుడు ప్రత్యక్ష సంచారంలోకి రానున్నారు. వీరి ప్రభావం అన్ని రాశుల వారిపై కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ గ్రహాల సంచార సమయంలో కొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశిచక్రం (Aries): మేష రాశి వారికి జనవరి నెల కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఈ నెలలో మీరు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృధా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. ఆఫీసులో ఎవరితోనైనా వాగ్వాదం రావచ్చు. ఈ సమయంలో మీ పనులు కొన్ని ఆగిపోవచ్చు.


కర్కాటక రాశిచక్రం (Cancer): జనవరి నెల ఈ రాశివారికి అననుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధం చెడిపోయే అవకాశం ఉంది. మీరు చిన్న చిన్న విషయాలకే కొప్పడతారు, ఇది ఇతరులతో మీ సంబంధాలను దెబ్బతిసే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేదంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశం  ఉంది. డబ్బు ఏ విధంగా వస్తుందో, ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది.


వృశ్చిక రాశిచక్రం (Scorpio): జనవరి నెల మీకు డబ్బు పరంగా బాగానే ఉంటుంది, కానీ పూర్వీకుల ఆస్తి వివాదం తెరపైకి వస్తుంది. దీంతో మీ కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. మీ తోబుట్టువులతో వైరం ఏర్పడుతుంది. ఉద్యోగాలు మారాలనుకునే వారికి ఈ సమయం అంతగా కలిసి రాదు. మెుత్తానికి ఈ సమయం కలిసి రాదు.


కుంభం (Aquarius): జనవరి నెల మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే జనవరిలో ఈ రాశివారిపై శని సడే సతి ప్రారంభం అవుతుంది. ఆఫీసులో వాతావరణం అంతగా అనుకూలంగా ఉండదు. బాస్‌తో చర్చకు దూరంగా ఉండండి. మీరు కొన్ని అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. లేకపోతే మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మెుత్తానికి ఈ సమయం మీకు కష్టంగా నడుస్తోంది.


Also Read: Sankranti Festival: 2023లో సంక్రాంతి ఎప్పుడు వచ్చింది? ఈ పండుగ విశిష్టత ఏంటి? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.