Chanakya Niti: ఆచార్య చాణిక్యుడు (acharya chanakya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతడికి కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు వంటి పేర్లు కలవు. చాణక్యుడి సలహాల మేరకే చంద్రగుప్త మౌర్యుడు నంద వంశానికి చక్రవర్తి అయ్యాడు. అంతేకాక అనేక మంది శత్రువులను  ఓడించగలిగాడు. అనాటి గొప్ప పండితుల్లో చాణిక్యుడు ఒకరు. ఆయన తన జీవితంలో ఎదురైనా అనుభవాలను చాణక్య నీతిలో (Chanakya Niti) వివరించారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏయే ఆంశాలు పాటించాలో అందులో వివరించారు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

** మీరు ఎల్లప్పుడూ లక్ష్మీదేవి (goddess lakshmi) అనుగ్రహం పొందాలనుకుంటే, ఆహారాన్ని వృధా చేయవద్దు అని ఆచార్య చాణక్యుడు చెప్పారు. ఆహారం వృధా చేయడం వల్ల తల్లి అన్నపూర్ణకు కోపం వస్తుంది మరియు ఆమె లక్ష్మీదేవి స్వరూపం.


** అందరికీ సహాయం చేస్తూ, తమ డబ్బును సద్వినియోగం చేసుకుంటూ, ఇతరుల పట్ల కృతజ్ఞతా భావాన్ని మనసులో కలిగి ఉండే వారి పట్ల లక్ష్మిదేవి ఎల్లప్పుడూ దయ చూపుతుంది.


** ప్రేమాభిమానులు ఎక్కువగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువు ఉంటుంది. అందుకే ఎల్లప్పుడూ ఒకరికొకరు ప్రేమ, గౌరవం ఇచ్చిపుచ్చుకోండి. 
** బడ్జెట్ వేసుకుంటూ అవసరానికి మాత్రమే ఖర్చు చేయండి. అనవసర ఖర్చుల జోలికి పోకండి.


** కష్టపడి పనిచేయడానికి వెనుకంజ వేయని వారి పట్ల తల్లి లక్ష్మి ఎల్లప్పుడూ దయ చూపుతుంది. ఈ వ్యక్తులకు ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు.


Also Read: Lord Shiva: పరమశివుడి ఆ రెండు అవతారాలు ఈ భూమిపై ఇంకా జీవించే ఉన్నాయట!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook