Planet Transition 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతీ గ్రహం ఒక నిర్ధిష్ట కాలం పాటు ఒక రాశిలో సంచరిస్తుంది. ఆ తర్వాత మరో రాశిలోకి ప్రవేశిస్తుంది. రాశి మార్పు సమయం రాశిచక్రంలోని 12 రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. అది శుభ ఫలితాలను ఇవ్వొచ్చు లేదా అశుభాలను కలిగించవచ్చు. రాబోయే 4 నెలల్లో మూడు గ్రహాలు రాశి మారనున్నాయి. ఆగస్టు 21న బుధ గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించనుంది. ఆ తర్వాత గురు, కుజ గ్రహాలు కూడా రాశి మారనున్నాయి. ఈ ప్రభావంతో 4 రాశుల వారికి చాలా మేలు జరగనుంది. ఆ 4 రాశులేంటి.. వారికి కలిగే శుభ ఫలితాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ 4 రాశుల వారికి శుభకాలం :


మిథునం (Gemini) : రాబోయే 4 నెలలు మిథున రాశి వారికి గొప్ప ఫలితాలు ఉంటాయి. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ చకచకా పూర్తవుతాయి. ఆర్థిక పురోగతి బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. ప్రేమ బంధం బలపడుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు కలిసొస్తాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం.


సింహం (Leo) : సింహ రాశి వారికి రాబోయే 4 నెలలు అదృష్ట కాలం. ఆర్థిక స్థితి గతులు మెరుగవుతాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉంటాయి. కొత్త ప్రాజెక్ట్ లేదా బిగ్ డీల్ ఏదైనా ఓకె అవుతుంది. తద్వారా భారీ మొత్తంలో డబ్బు అందుతుంది.


తుల (Libra) : తులా రాశి వారి కెరీర్ ఆశాజనకంగా సాగుతుంది. జాబ్ ప్రమోషన్ లేదా మంచి వేతనంతో కూడిన మరో జాబ్ దొరుకుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ ఉండవచ్చు. కుటుంబ సమస్యలు, వివాదాలు సమసిపోతాయి. వివాహం నిశ్చమయ్యే అవకాశం ఉంటుంది.


వృశ్చికం (Scorpio) : ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు 4 నెలల పాటు శుభకాలం. చేపట్టిన పని ఏదైనా సక్సెస్ సాధిస్తారు. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. మతపరమైన, ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు.


(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ తెలుగు న్యూస్ దానిని ధృవీకరించలేదు.)


Also Read: Horoscope Today August 16th : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి సంతోష సమయం.. ఇన్నాళ్లు దూరంగా ఉన్న భార్యాభర్తలు మళ్లీ ఒక్కటవుతారు  


Also Read: Munugode Byelection: మునుగోడు నియోజకవర్గంలో కలకలం.. చౌటుప్పల్ ఎంపీపీ అరెస్ట్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook