Four Rajyog In Horoscope: గ్రహాలు కాలానుగుణంగా రాజయోగాన్ని ఏర్పరుస్తాయి. దీని ప్రభావం మానవ జీవితంపై ఖచ్చితంగా ఉంటుంది. ఈయోగాలు కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. 20 ఏళ్ల తర్వాత నాలుగు అరుదైన రాజయోగాలు ఏర్పడుతున్నాయి. అవే సత్కీర్తి, హర్ష, భారతి మరియు వర్షిత. ఈ రాజయోగాల ప్రభావం అన్ని రాశుల వారిపై ఉంటుంది. దీని కారణంగా మూడు రాశులవారు ఆర్థిక లాభం, పురోభివృద్ధి సాధించనున్నారు. ఆ లక్కీ రాశులేవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనుస్సు రాశిచక్రం (Sagittarius): నాలుగు రాజయోగాలు ఏర్పడటం వల్ల ధనుస్సు రాశి వారికి మంచి రోజులు ప్రారంభంకానున్నాయి. ఎందుకంటే శనిదేవుని సంచార సమయంలో ధనుస్సు రాశి వారికి సడే సతి నుండి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. పాతపెట్టుబడి నుండి మీరు లాభం పొందుతారు. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి. రాజకీయాల్లో ఉన్నవారు మంచి పదవిని పొందుతారు. సమాజంలో గౌరవం ఉంటుంది. 
వృషభ రాశి (Taurus): రాజయోగం ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఆకస్మిక ధనాన్ని పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్లు విజయం సాధిస్తారు. మీరు పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆఫీసులో మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాసం ఉంది. 
తులా రాశిచక్రం (Libra): నాలుగు రాజయోగాలు ఏర్పడటంతో తులారాశి వారి ఆదాయం పెరగనుంది. ఎందుకంటే జనవరి 17 నుండి మీకు ధైయా నుండి కూడా విముక్తి లభించింది. దీంతో వ్యాపారులు బిజినెస్ లో భారీగా లాభాలను గడించనున్నారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మీరు వ్యక్తిగత జీవితానికి సంంబంచి శుభవార్త వింటారు. 


Also Read: Venus transit 2023: శని రాశిలో శుక్రుడి ప్రవేశం.. వీరి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook