Gajakesari Yoga 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరంలోని సెప్టెంబర్ మాసానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ నెలలోని మొదటివారం గజకేసరి యోగంతో ప్రారంభం కాబోతోంది. ఇంతటి శుభయోగంతో ప్రారంభమైన ఈ వారంలో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ యోగం ఏర్పడడానికి ప్రధాన కారణాలు వృషభరాశిలో బృహస్పతి గ్రహంతో పాటు ఎంతో ప్రత్యేకత కలిగిన చంద్ర గ్రహం కలయిక జరగబోతోంది. దీంతో ఈ అద్భుతమైన గజకేసరి యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ యోగ సమయంలో కొన్ని రాశుల వారికి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా వెంటవెంటనే జరిగిపోతాయి. అలాగే కెరీర్ పరంగా అనుకున్న పనుల్లో కూడా విజయాలు సాధిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గజకేసరి యోగం కారణంగా అత్యధిక లాభాలు పొందబోయే రాశుల వారెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభ రాశి 
ఈ వృషభ రాశి వారికి గజకేసరి యోగం కారణంగా అనుకున్న పనులు జరుగుతాయి. ఈ వారం ప్రారంభంలో వృత్తిపరంగా ఎన్ని అడ్డంకులు ఉన్నా సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వస్తాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి ఈ సమయంలో కాస్త ఉపశమనం కూడా లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగాలు చేసే వారికి సీనియర్ల నుంచి మంచి సపోర్ట్ లభించి అనుకున్న పనుల్లో సులభంగా విజయాలు సాధించి కార్యాలయాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. కోర్టు కేసుల్లో కీలక ఘట్టం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా కేసులకు సంబంధించిన వాదనలు కూడా మీ వైపు అనుకూలంగా ఉంటాయి. ఇక భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు కూడా ఈ సమయంలో పరిష్కారమవుతాయి. దీనికి కారణంగా భాగస్వామి సపోర్టు లభించి అనుకున్న ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. 


కర్కాటక రాశి 
కర్కాటక రాశి వారికి కూడా సెప్టెంబర్ మొదటివారం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి స్నేహితుల నుంచి మంచి సపోర్టు లభించి అనుకున్న వ్యాపారాల్లో కూడా సులభంగా పెట్టుబడులు పెడతారు. దీంతోపాటు సమాజంలో హోదా గౌరవం కూడా పెరుగుతుంది. విదేశాల్లో వ్యాపారాలు చేయాలనుకునే వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు మంచి ఆఫర్స్ కూడా పొందుతారు. వృత్తి జీవితం గడుపుతున్న వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీని కారణంగా ఊహించని ధన లాభాలు పొందడమే.. కాకుండా జీవితంలో అనుకున్న పనులు కూడా సులభంగా చేయగలుగుతారు.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


కన్యా రాశి 
సెప్టెంబర్ మొదటివారం కన్యా రాశి వారికి ఎంతో అదృష్టకరంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు లాభాలు పొందడమే కాకుండా నష్టాలనుంచి విముక్తి పొందుతారు. ముఖ్యంగా వ్యాపారాలు వృత్తి జీవితాన్ని అనుభవిస్తున్న వారు ఈ సమయంలో చిన్న చిన్న ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రయాణాలు చాలావరకు అనేక ప్రయోజనాలను అందిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలకైతే ఈ సమయం ఎంతో శుభ్రంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు ఈ సమయంలో ప్రమోషన్స్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే పిల్లలనుంచి వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. దీంతోపాటు వారి నుంచి గుడ్ న్యూస్ కూడా వినే ఛాన్స్ ఉందని జ్యోతిష్యులు చెపుతున్నారు.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.