Guru Gochar 2023: గజలక్ష్మీ రాజయోగంతో ఈ 4 రాశులకు తిరుగులేనంత ధనం.. ఇందులో మీరున్నారా?
Guru Gochar 2023: మేష రాశిలో బృహస్పతి రాకతో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడింది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. గజలక్ష్మీ రాజయోగం ఏయే రాశులకు మేలు చేస్తుందో తెలుసుకుందాం.
Benefits of Gajalakshmi Raja Yoga 2023: 12 ఏళ్ల తర్వాత దేవగురు బృహస్పతి మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఏడాదికొకసారి తన రాశిని మార్చే గురుడు మేషరాశిలోకి ప్రవేశించడంతో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగాన్ని ఆస్ట్రాలజీలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఎవరి జాతకంలో ఈ యోగం ఏర్పడిందో వారు అనేక ప్రయోజనాలు పొందుతారు. అయితే రాహు గ్రహం ఇప్పటికే మేషరాశిలో సంచరిస్తున్నాడు. గురుడు రాహువు సంయోగం కారణంగా ఈ గజలక్ష్మీ రాజయోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
తులారాశి
గజలక్ష్మి యోగం వల్ల వీరు మంచి ఫలితాలను పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది.
మీనరాశి
బృహస్పతి మేష రాశిలోకి ప్రవేశించడం వల్ల ఏర్పడిన గజలక్ష్మీ రాజయోగం మీనరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా మీరు బలపడతారు. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్, ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.
Also Read: Mangal Gochar 2023: మరో 17 రోజుల తర్వాత వీరి అదృష్టం మారిపోనుంది.. ఇందులో మీరున్నారా?
మిధునరాశి
గజలక్ష్మి యోగం కారణంగా మిథునరాశి వారికి మేలు చేస్తుంది. వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడు ఉంటుంది. దీంతో వీరు ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగులు మంచి ఫలితాలను పొందుతారు. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు.
కన్య
కన్యా రాశి వారికి గజలక్ష్మి రాజయోగం లాభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది.
Also Read: Guru Uday 2023: ఏప్రిల్ 27న బృహస్పతి ఉదయం.. ఈ 3 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి! లేదంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook