Rajyog: 12 ఏళ్ల తర్వాత మీనరాశిలో 3 రాజయోగాలు.. ఈ రాశులకు కొత్త జాబ్, ఉద్యోగంలో ప్రమోషన్ ..
Budhaditya And Gajkesri Rajyog: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, మీన రాశిలో 12 సంవత్సరాల తర్వాత మూడు రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీంతో మూడు రాశులవారు భారీగా లాభాలను పొందనున్నారు.
Budhaditya And Gajkesri Rajyog: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మార్చడం ద్వారా రాజయోగాలను సృష్టిస్తాయి. ఉగాది నాడు అంటే మార్చి 22న మూడు రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. బృహస్పతి యెుక్క సొంత రాశి అయిన మీనరాశిలో హన్స్, గజకేసరి మరియు బుధాదిత్య రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ మూడు రాజయోగాలు కొన్ని రాశులవారికి అపారమైన ధనాన్ని ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
ధనుస్సు రాశిచక్రం
హన్స్ రాజయోగం ఏర్పడటంతో ధనుస్సు రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. ఎందుకంటే మీ సంచార జాతకంలో నాల్గవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. దీంతో మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఆస్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు లాభాలను పొందుతారు. వ్యాపారం, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారు రాణిస్తారు.
మీన రాశిచక్రం
మూడు రాజయోగాలు ఈ రాశి యెుక్క లగ్న గృహంలో ఏర్పడుతున్నాయి. దీంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. లవ్ సక్సెస్ అవుతుంది. దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. మీ వ్యక్తిత్వం అందరిని ఆకట్టుకుంటుంది. పెళ్లికాని వారికి వివాహం కుదురుతుంది.
కర్కాటక రాశిచక్రం
బుధాదిత్య రాజయోగం వల్ల కర్కాటక రాశివారికి మంచి రోజులు మెుదలవుతాయి. ఎందుకంటే మీ రాశితో అదృష్ట స్థానంలో ఈ యోగం ఏర్పడుతోంది. దీంతో మీకు అదృష్టం ప్రకాశిస్తుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు మంచి జాబ్ వస్తుంది. మెుత్తానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
Also Read: Mars transit 2023: నేటి నుండి ఈ రాశుల సుడి తిరగనుంది.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook