Guru Gochar 2023: హోలీ తర్వాత `గజలక్ష్మి యోగం`... వీళ్ల ఇంటిపై నోట్ల వర్షం ఖాయం..
Gajlakshmi Yog: ఆస్ట్రాలజీలో దేవగురు బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. త్వరలో జ్యూపిటర్ అరుదైన యోగాన్ని చేయబోతుంది. దీంతో హోలీ తర్వాత కొందరు ధనవంతులు కానున్నారు.
Guru Gochar In April 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల అనుకూలత వల్ల అనేక శుభ రాజయోగాలు ఏర్పడుతున్నాయి. వీటిలో గజలక్ష్మీ రాజయోగం ఒకటి. ఏప్రిల్ 22న దేవగురు బృహస్పతి తన రాశిని మార్చి మేషరాశిలోకి ప్రవేశించనుంది. అప్పటికే అదే రాశిలో చంద్రుడు ఉంటాడు. ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా అరుదైన గజలక్ష్మి యోగం ఏర్పడుతుంది. ఈయోగం వల్ల ఏ రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.
అరుదైన రాజయోగం ఈ 3 రాశుల వారికి శుభప్రదం
ధనుస్సు రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశిలో ఏర్పడిన గజలక్ష్మీ రాజయోగ ప్రభావం ధనుస్సు రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయవంతం అవుతారు. ఈరాశి వారికి అదృష్టం కలిసి వచ్చి ఆదాయం రెట్టింపు అవుతుంది. మీ కెరీర్ లో అపారమైన పురోగతి సాధిస్తారు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది.
మేషరాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గజలక్ష్మి రాజయోగం ఈ రాశి వారికి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఈ రాశిలోనే ఈ యోగం ఏర్పడనుంది. ఆర్థికంగా మీరు లాభపడతారు. ప్రతి రంగంలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. కుటుంబ గౌరవం పెరుగుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.
మిథునరాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాజయోగం వల్ల మిథున రాశి వారికి కలిసి వస్తుంది. శనిదేవుడి చెడు ప్రభావం నుండి విముక్తి లభిస్తుంది. దేవగురువు బృహస్పతి అనుగ్రహం వల్ల వ్యాపారంలో ధనలాభం ఉంటుంది. మీరు ప్రతి పనిలోనూ విజయకేతనం ఎగురవేస్తారు. మెుత్తానికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
Also read: Grah Gochar 2023: ఫిబ్రవరి ఈ గ్రహాల సంచారం.. ఈ రాశులను వరించనున్న అదృష్టం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook