Gajlaxmi Rajyog 2023: ప్రతి గ్రహం తన సొంత రాశిని వదిలి ఇతర రాశిలోకి సంచారం చేస్తుంది. ఏప్రిల్ 22 శనివారం గురు గ్రహం ఉదయం 06:12 గంటలకు మేషరాశిలోకి ప్రవేశించింది. మేషరాశిలో ఈ గ్రహం సంచారం చేయడం వల్ల  గజలక్ష్మీ యోగం ఏర్పడిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  ఈ యోగం ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ఎవరి జాతకంలో గజలక్ష్మి యోగం ఏర్పడిందో వారికి సంపద, ఐశ్వర్యం లభిస్తుంది. అంతేకాకుండా అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఏయే రాశులవారిపై గజలక్ష్మి యోగం ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశువారిపై గజలక్ష్మి యోగం ప్రభావం:
మిథునరాశి:

మిథునరాశికి 11వ స్థానంలో గజలక్ష్మి యోగం ఏర్పడింది. కాబట్టి ఈ రాశువారు చాలా రకాల ప్రయోజనాలు పొందడమేకాకుండా ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగాలు చేసేవారికి పనులన్ని సానుకూల జరుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారు తప్పకుండా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇలా శ్రద్ధతో పెట్టుబడులు పెట్టడం వల్ల చాలా భారీ లాభాలు పొందుతారు. ప్రభుత్వ రంగాల్లో పని చేసేవారికి ప్రమోషన్స్‌ లభించే ఛాన్స్‌ కూడా ఉంది. 


కర్కాటక రాశి:
కర్కాటక రాశివారికి తొమ్మిదో స్థానంలో గజలక్ష్మి యోగం ఏర్పడింది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారంలో కూడా విజయం సాధించవచ్చు. ఈ యోగం ఉద్యోగంలో ప్రమోషన్‌కు కూడా అవకాశాలను అందిస్తుంది. కాబట్టి డబ్బు ఖర్చు చేసే క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. 


Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో


కన్య రాశి:
కన్యారాశి వారికి ఎనిమిదో స్థానంలో గజలక్ష్మి యోగం ఏర్పడుతోంది. కాబట్టి వైవాహిక జీవితంలో మంచి ఆనందాన్ని పొందుతారు.  దీంతో పాటు గౌరవం పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు ఈ యోగం వల్ల పొందుతారు. వ్యాపారాలు చేసేవారు భారీ లాభాలు పొందే అవకాశాలున్నాయి. 


తులారాశి:
తులా రాశి వారికి కూడా గజలక్ష్మి యోగం ఏర్పడింది. ఈ సమయంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పూర్వీకుల ఆస్తి  నుంచి కూడా మంచి లాభాలు పొందుతారు. 


మీనరాశి:
మీన రాశి ద్వితీయ రాశిలో గజలక్ష్మి యోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా బాగుంటాయి. ఆర్థిక రంగంలో కూడా ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ఉద్యోగాలు చేసేవారికి ఈ క్రమంలో ప్రమోషన్ కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఖర్చులు తగ్గి ఆదాయం కూడా పెరుగుతుంది. 


Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook