Ganesh Chaturthi 2022: గణేశ్ చతుర్థి నాడు ఇంట్లో ఎలుక కనిపిస్తే శుభమా ? అశుభమా ?
Ganesh Chaturthi 2022:దేశవ్యాప్తంగా రేపటి (ఆగస్టు 31) నుంచి వినాయక చవితి ఉత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే గల్లీ గల్లీకి మంటపాలు ఏర్పాటయ్యాయి.
Ganesh Chaturthi 2022: దేశవ్యాప్తంగా రేపటి (ఆగస్టు 31) నుంచి వినాయక చవితి ఉత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే గల్లీ గల్లీకి మంటపాలు ఏర్పాటయ్యాయి. 9 లేదా 10 రోజుల పాటు గణపతిని హిందువులు భక్తి శ్రద్ధలతో కొలువనున్నారు. గణేశ్ చతుర్థికి సంబంధించి కొన్ని నమ్మకాలు ప్రజల్లో ఉన్నాయి. చవితి నాడు చంద్రుడిని చూస్తే నీలాపనిందలు తప్పవని నమ్ముతారు. అలాగే చవిత రోజు ఇంట్లో ఎలుక కనిపిస్తే శుభమని.. లేదు అశుభమని చెబుతుంటారు. ఇంతకీ చవితి నాడు ఇంట్లో ఎలుక కనిపిస్తే శుభమా.. అశుభమా...
గణేష్ చతుర్థి నాడు ఎలుక కనిపిస్తే
గణేశ్ చతుర్థి నాడు ఇంటి నుంచి ఎలుక బయటకు వెళ్తుండగా మీ కంట పడినట్లయితే అది శుభసూచకం. మీ పేదరికం, కష్టాలన్నీ తొలగిపోతాయనే దానికి సంకేతం. తద్వారా మీ ఇంట్లో సంతోషం నెలకొంటుంది.
ఇంట్లో తెల్ల ఎలుక మీకు కనిపించినా శుభసూచకమే. తెలుపు సానుకూలతకు చిహ్నం. తెల్ల ఎలుక మీకు కనిపించినట్లయితే మీకు సానుకూల పరిస్థితులు రాబోతున్నాయని అర్థం.
గణేశ్ చతుర్థి నాడు నిద్ర లేచిన వెంటనే ఎలుకను చూడటం మాత్రం అశుభమని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది.
గణేశ్ చతుర్థి నాడు ఎలుకను ఎట్టి పరిస్థితుల్లో చంపకూడదు. తరిమికొట్టవచ్చు కానీ చంపకూడదు. ఒకవేళ చంపితే మీ ఇంట్లో ఎవరి ఆరోగ్యమైనా క్షీణించవచ్చు. భారీ నష్టాన్ని చవిచూసే ప్రమాదం లేకపోలేదు.
వినాయక చవితి నాడు చంద్రుడిని ఎందుకు చూడవద్దు :
వినాయకుడిని బొజ్జ గణపయ్య అని పిలుచుకుంటుంటాం.వినాయకుడి ఆకారాన్ని బట్టి ఆ పేరు వచ్చింది. ఒకరోజు వినాయకుడు తనకు బాగా ప్రీతికరమైన ఉండ్రాళ్ల పాయసం బొజ్జం నిండా ఆరగించాడు. అనంతరం ఎలుకపై ఎక్కి బయలుదేరాడు. అది చూసి చంద్రుడు నవ్వడంతో.. ఇకపై నీ వెలుతురు భూమిపై సోకదు గాక అని శపించాడు. చంద్రుడు క్షమాపణ కోరడంతో శిక్షను కాస్త తగ్గించాడు. వినాయక చవితి నాడు చంద్రుడిని చూసినవారికి నీలాపనిందలు తప్పవని శాపమిచ్చాడు. అందుకే ఆరోజు చంద్రుడిని చూసినవారు లేనిపోని నిందల బారినపడుతారని నమ్ముతారు.
(నిరాకరణ: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. జీ తెలుగు న్యూస్ దీన్ని ధ్రువీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook