Garuda Puranam: ఈ నాలుగు కనిపిస్తే.. ఆరోజు మీకు తప్పక శుభం కలుగుతుంది...
Garuda Puranam: వ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణాల్లో ఒకటైన గరుడ పురాణంలో మనిషి చేసే పాపాలు... నరలోకంలో అందుకు విధించే శిక్షలకు సంబంధించి పూర్తి వివరణ ఉంటుంది. అంతేకాదు, మనిషి ఏ పనులు చేయకూడదో గరుడ పురాణం చెబుతుంది. గరుడ పురాణం ప్రకారం మనం వెళ్లే దారిలో కొన్ని వస్తువులు లేదా జంతువులు మన కంటపడటం శుభసూచకం. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...
Garuda Puranam: గురుడ పురాణానికి హిందూ మతంలో ప్రత్యేక స్థానం ఉంది. వ్యాస మహర్షి రచించిన ఈ పురాణం.. సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు గరుడ పక్షికి ఉపదేశించినదిగా చెబుతారు. అందుకే దీనికి గరుడ పురాణం అనే పేరు వచ్చింది. మనిషి మరణాంతర కర్మల ఫలితం... నరలోక వర్ణన... అక్కడ విధించే శిక్షలు... మనుషులు చేసే పాపాలకు ప్రాయశ్చిత్త మార్గాలు.. తదితర విషయాలకు ఇందులో విపులమైన, విస్తృతమైన వివరణ ఉంటుంది. అందుకే చాలామంది గరుడ పురాణాన్ని శ్రద్ధగా పఠిస్తారు. నిత్య జీవితానికి సంబంధించి కూడా గరుడ పురాణంలో పలు ఆసక్తికర విషయాలు చెప్పబడ్డాయి. గరుడ పురాణం ప్రకారం... ఒక రోజులో గోవు, గోమూత్రం, పంట పొలం, గోధూళి కనిపించడాన్ని శుభప్రదంగా భావిస్తారు.
ఆవు
హిందూ మత విశ్వాసాలలో ఆవును అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. రోజులో ఏ సమయంలో గోమాత కనిపించినా దాన్ని శుభప్రదంగా భావిస్తారు. అలా కనిపించినప్పుడు మనసులో నమస్కరించుకుంటే శుభం కలుగుతుంది. గోమాత దర్శనం ద్వారా మీకు ఎదురయ్యే చెడు కూడా తొలగిపోతుంది.
గోమూత్రం
హిందూ మతంలో గోమూత్రాన్ని కూడా పవిత్రమైనదిగా భావిస్తారు. పూజా క్రతువులు, ఇతర శుభకార్యాల్లో దీన్ని ఉపయోగిస్తారు. కాబట్టి గోమూత్రాన్ని చూడటం శుభప్రదంగా భావిస్తారు. గోమూత్రం సేవించడం కూడా మంచిదని భావిస్తారు. ఆయుర్వేదంలో అనేక రకాల మందుల తయారీలో గోమూత్రాన్ని ఉపయోగిస్తారు.
పంట పొలం
గరుడ పురాణం ప్రకారం.. మనం వెళ్లే దారిలో పంట పొలాన్ని చూడటం శుభ సంకేతం. ఆ పంట అప్పటికే పండినదైతే.. అది మరింత శుభప్రదం. పండిన పంటలతో నిండిన పొలాన్ని చూస్తే మనిషికి పుణ్యంతో పాటు మంచి జరుగుతుందని గరుడ పురాణంలో చెప్పబడింది.
గోధూళి
గోమూత్రమే కాదు గోధూళిని కూడా పవిత్రమైనదిగా భావిస్తారు. గోవుల మంద వెళ్లేటప్పుడు నేల నుంచి ఎగిసే దుమ్ము పవిత్రమైనదిగా చెబుతారు. కాబట్టి గోధూళిని చూడటం కూడా శుభప్రదమైనదిగా (Spiritual) భావిస్తారు. గోవు, గోమూత్రం, గోధూళి, పంట పొలం... ఒకరోజులో ఈ నాలుగింటిని చూసినట్లయితే ఆ వ్యక్తులకు శుభం కలుగుతుంది. వారికి ఎదురయ్యే చెడు కూడా తొలగిపోతుందని నమ్ముతారు.
Also Read: Pushpa Day 1 Collection: అల్లు అర్జున్ 'పుష్ప' మూవీ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook