Chant Gayatri Mantra: హిందూ మతంలో గాయత్రీ మంత్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మంత్రాన్ని పఠిస్తే సకల దేవతలను స్తుతించినట్లని పెద్దలు చెబుతారు. ఈ మంత్రం చాలా మహిమాన్వితమైనదిగా జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. గాయత్రీ మంత్రం (Gayatri Mantra) చాలా శక్తివంతమైన మంత్రం. దీనిని జపించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అంతేకాకుండా మనపై ఉన్న ఒత్తిడి దూరమవుతుంది. అందుకే స్టూడెంట్స్ ఈ మంత్రాన్ని సరైన పద్ధతిలో పఠిస్తే చదువుపై ఆసక్తి పెరుగుతుందని నమ్మకం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎప్పుడు జపించాలి?
నాలుగు వేదాలలోని ప్రధాన సారాంశంగా గాయత్రీ మంత్రాన్ని భావిస్తారు. గాయత్రీ మంత్రాన్ని పఠించడం విద్యార్థులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు. విద్యార్థులకు ఈ మంత్రాన్ని ఉదయం సూర్యోదయానికి కొద్దిగా ముందు జపించాలి. గాయత్రీ మంత్రాన్ని మధ్యాహ్నం కూడా జపించవచ్చు. జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి గాయత్రీ మంత్రాన్ని క్రమం తప్పకుండా పఠిస్తే మంచిది. 


గాయత్రీ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు క్రమం తప్పకుండా దీనిని పఠించడం వల్ల మార్కులు బాగా సాధించవచ్చు. విద్యార్థి బ్యాగ్‌లో గాయత్రీ మంత్రం ఫోటో ఉంచుకుంటే విశేష ప్రయోజనం ఉంటుందని చాలా మంది నమ్ముతారు. 


Also read: Shani Dev: మనపై శని దేవుడికి ఎప్పుడు కోపం వస్తుంది? తెలుసుకోవడం ఎలా? 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook