Gemini Zodiac Sign Peoples very carefully in evry work due to Mangal Gochar 2023: మిథున రాశిలో కుజుడు ప్రవేశించడం వల్ల ధనుస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరితో కలిసి మెలసి ఉండాల్సి వస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు ఇతరులతో చిన్న విషయాలలో కూడా సౌమ్యత మరియు సరళత ప్రదర్శించాలి. మార్చి 13 నుంచి మే 10 మధ్య సమయం మీకు చాలా ఆలోచనాత్మకంగా ఉంటుంది. తెలివితేటలు, విచక్షణ, సంతానం, ఉన్నత చదువులు, విదేశాలు, ఖర్చులకు అధిపతి కుజుడు అధిపతి అన్న విషయం తెల్సిందే. ఇది పిల్లల పురోగతికిసరైన సమయం అయినా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి పట్ల ప్రశాంతంగా ఉండాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనుస్సు రాశి వారు మీ కార్యాలయంలోని నియమాలను సరిగ్గా పాటించాలి. లేదంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తొందరపాటు అస్సలు వద్దు. ఉద్యోగం మారాలనే ఆలోచన మనసులో మెదులుతుంది, మనస్సు వ్యాపారం వైపు మళ్లుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పని భారం కారణంగా ప్రవర్తనలో చికాకు ఉండవచ్చు. పని విషయంలో సహోద్యోగులతో విభేదాలు రావచ్చు.


ధనుస్సు రాశి వారు వ్యాపారంలో కొత్త ఒప్పందాన్ని చేయబోతున్నట్లయితే అప్రమత్తంగా ఉండాలి. వ్యాపార భాగస్వామ్యాలతో సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది. పెళ్లి చేసుకోని యువత ప్రేమ వ్యవహారంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతే ఒక అడుగు ముందుకు వేయాలి. ఈ రాశి వారు స్నేహితులతో కలిసి మతపరమైన యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. వైవాహిక జీవితంలో అసమ్మతి పెరుగుతుంది. సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి పట్ల మర్యాదగా ఉండడానికి  ప్రయత్నించాలి.


ధనుస్సు రాశి వారి జీవిత భాగస్వామికి తలనొప్పి, బిపి పెరిగే సమస్య ఉండవచ్చు. కడుపులో చికాకు, అజీర్తి సమస్య రావచ్చు. ఎక్కువ నీరు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారు రాత్రిపూట సమృద్ధిగా ఆహారం తీసుకోవద్దు. చల్లని ఆహారం మరియు పానీయాలకు దూరంగా ఉండాలి. గొంతుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ధనుస్సు రాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండకుంటే.. మూల్యం చెల్లించుకోవాలి. 


Also Read: High Mileage SUVs: అత్యధిక మైలేజీనిచ్చే 6 ఎస్‌యూవీలు.. లీటర్ పెట్రోల్‌పై 28 కిలోమీటర్లు!  


Aslo Read: Shukra Gochar 2023: హోలీ తర్వాత ఈ రాశుల వారికి వరించనున్న అదృష్టం.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారు! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.