Gomatha Pooja: ఆవుకు క్రమం తప్పకుండా బెల్లం తినిపిస్తే ఎలాంటి లాభాలను పొందుతారో తెలుసుకోండి..!!
Gomatha Pooja: హిందూ మతంలో ఆవును తల్లిలా భావిస్తారు. ఆవులో ప్రత్యేక్షంగా 33 దేవతలు కొలువుదీరి ఉంటాయని హిందు పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే హిందూ మతంలో ఆవును ఓ దైవంగా భావించి పూజిస్తారు.
Gomatha Pooja: హిందూ మతంలో ఆవును తల్లిలా భావిస్తారు. ఆవులో 33 దేవతలు కొలువుదీరి ఉంటాయని హిందు పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే హిందూ మతంలో ఆవును ఓ దైవంగా భావించి పూజిస్తారు. సనాతన ధర్మంలో శ్రీకృష్ణుడు కూడా గోవులను ఇష్టపడి పెంచుకునేవారు. అందుకే గోవులో ఆ భవంతున్ని ఉన్నాడని భావిస్తారు. గోవుకు సేవ చేసేవారి ఇంట్లో దరిద్రం తొలగిపోతుందని ప్రజలు నమ్ముతారు. అంతే కాకుండా గోవుకు దానం చేయడం గొప్ప దానంగా పరిగణిస్తారు. ప్రముఖ జ్యోతిష్యు పండితులు తెలిపిన వివరాల ప్రకారం...ఆవుకు బెల్లం లేదా రోట్టెను తినిపించడం వల్ల రాశిల్లో వివిధ దోషాలుంటే తొలగిపోతాయని తెలిపారు.
ఆవుకు రోటీతో బెల్లం తినిపించడం వల్ల కలిగే ప్రయోజనాలు:
క్రమం తప్పకుండా ఆవుకు బెల్లంతో రొట్టెను తినిపించే వ్యక్తిలు అన్ని రంగంలో అభివృద్ధి చెందుతారు. వారు జీవితంలో నిరంతరం పురోగతిని సాధిస్తారు. మీరు కూడా పురోగతిని పొందాలనుకుంటే ఆవుకు క్రమం తప్పకుండా బెల్లంతో కూడిన రోట్టెలను తినిపించండి. ఇంతే కాకుండా దైవం నుంచి శక్తి పొంది అతను చేసిన పనుల నుంచి మంచి ప్రయోజనాన్ని పొందుతారు. పెండింగ్‌లో ఉన్న పనులు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయని పండితులు తెలిపారు. సంతానం కోసం చూసే వారు ప్రతిరోజు ఉదయం ఆవుకు బెల్లం తినిపిస్తే సంతానం కలుగుతుందని నమ్మకం. అంతే కాకుండా చార్ ధామ్ యాత్ర చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో.. ఆవుకు బెల్లం తినిపించడం వల్ల అంత పుణ్యం లభిస్తుందని పురాణాలు తెలుపుతున్నాయి. ఆవును పూజిస్తే సకల సుఖాలను పొందడమే కాకుండా..రోగాల నుంచి రక్షణ పొందుతారు. గోవుకు సేవ చేయడం ద్వారా 33 దేవతల ఆశీస్సులు లభిస్తాయని శాస్త్రం తెలుపుతోంది.
Also Read: Video: పాముపై దాడి చేసి పొరపాటు పడ్డా ఆ పక్షి..ఏమైందో చూస్తే ఆశ్చర్యతారు..!!
Also Read: Ashoka Tree for Diabetes: అశోక చెట్టు బెరడులో డయాబెటిస్ మటుమాయం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook