Govardhan Puja 2022: గోవర్ధన పూజను గ్రహణం కారణంగా ఏ రోజు జరుపుకోవాలో తెలుసా..పూజా విధి, పూజ విశిష్టత..
Govardhan Puja 2022: గోవర్ధన పూజలో భాగంగా శ్రీకృష్ణుడికి భక్తి శ్రద్ధతో 56 రకాల ఆహార పదార్థాలతో కూడిన నైవేద్యాలను సమర్పిస్తారు. అంతేకాకుండా చాలా మంది గోవర్ధనుడి అనుగ్రహం పొందడానికి ఉపవాసాలు కూడా పాటిస్తారు.
Govardhan Puja 2022: ఈ సంవత్సరంలో పండుగ సీజన్ ప్రారంభమై ముగింపు దశకు చేరుకుంది. ప్రతి సంవత్సరంలాగే దీపావళి పండుగను ఈ సారి కూడా ఘనంగా జరిగింది. దీపావళి పండగ ప్రజల జీవితాల్లో ఆనందాన్ని, వెలుగులను తెస్తుందని హిందువులు నమ్ముతారు. అందుకే ఆ రోజున లక్ష్మి దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే లక్ష్మి దేవి పూజలో భాగంగా ఇళ్లను శుభ్రం చేయడం నుంచి లైట్లు, రంగోలీలు అలకరించడం వరకు ఎంతో సంబరంగా సాగుతాయి. అయితే దీపావళి తర్వాత దేశ వ్యాప్తంగా గోవర్ధన్ పూజను జరుపుకుంటారు. ఈ పూజను ప్రతి ఏడాది కార్తీక శుక్ల ప్రతిపాదంలో ఘనంగా నిర్వహిస్తారు.
గోవర్ధన పూజలో భాగంగా గోవర్ధనుడి ఇష్టమైన అన్నకూట్ నైవేద్యాన్ని తయారు చేస్తారు. అంతేకాకుండా గోవర్ధనుని బొమ్మను తయారు చేయడానికి ఆవు పేడను వినియోగిస్తారు. ఇలా తయారు చేసిన బొమ్మను భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యాలను సమర్పిస్తారు. అయితే ఈ పూజలో భాగంగా లక్ష్మీ పూజ కార్యక్రమం కూడా చేస్తారు. ఈ పూజను ఏ సమయంలో జరుపుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చొ మనం ఇప్పుడు తెలుసుకుందాం..
గోవర్ధన పూజ ఈ రోజు జరుపుకోవచ్చా..?:
హిందూ పురాణాల ప్రకారం గోవర్ధన్ పూజను ఈ సంవత్సరం ఈ రోజు ( 25 అక్టోబర్ 2022, మంగళవారం) జరుపుకుంటారు. అయితే ఈ రోజు సూర్యగ్రహణం ఉండడంతో గోవర్ధన్ పూజ దీపావళి మరుసటి రోజున కాకుండా బుధవారం, అక్టోబర్ 26, 2022(రేపు) జరుపుకోవాల్సి ఉంటుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
పూజా విధి:
>>హిందూ పురాణాల ప్రకారం..కార్తీక మాసం, ప్రతిపాద తిథి నాడు గోవర్ధన పూజ చేసుకోవాల్సి ఉంటుంది.
>>అక్టోబర్ 26న 06:29 నుంచి 08:43 వరకు మంచి ముహూర్తం.
విశిష్టత:
పురాణాల ప్రకారం శ్రీ కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని, గోవులను పూజించమని బ్రజ్వాసీలను కోరినప్పుడు..ఈ క్రమంలో ఇంద్రుడు కోపం వస్తుంది. దీంతో ఇంద్రుడు కుండపోత వర్షాలు కురిపించి.. అక్కడ నివసించే ప్రజలను తీవ్ర నష్టాని గురి చేస్తాడు. ఈ క్రమంలో శ్రీ కృష్ణుడు అక్కడి ప్రజలను, జంతువులను రక్షించడానికి చిటికెన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. ఇలా పర్వాతాన్ని ఏడు రోజుల పాటు ఆ పర్వాతన్ని చిటకన వేలుపైనే నిలుపుతాడు. అందుకే గోవర్ధన్ పూజ సమయంలో ప్రజలు ఈ పర్వతాన్ని ఆవు పేడతో చెక్కి ఏడుసార్లు ప్రదక్షిణ చేస్తారు.
పూజలో భాగంగా ఈ నైవేద్యాలను శ్రీకృష్ణుడికి సమర్పిస్తారు:
పూజలో భాగంగా గోవర్ధనుడికి తాజా పూలతో చేసిన దండలు సమర్పించి.. ఆయనకు ఇష్టమైన స్వీట్లుతో కూడిన 56 రకాల ఆహార పదార్థాలతో కూడిన నైవేద్యాలను సమర్పిస్తారు. అంతేకాకుండా భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు పాటిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి