Grah Gochar 2023: ఆగస్ట్‌లో కీలక గ్రహ సంచారాలు.. ఈ రాశులవారి కెరీర్ అదుర్స్..
Grah Gochar 2023 ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తోంది. వచ్చే నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. వీటి మార్పు వల్ల కొందరు లాభపడనున్నారు.
August Planet Transit 2023: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా శుభ, అశుభ యోగాలు ఏర్పరుస్తాయి. ఆగస్టు నెలలో కొన్ని పెద్ద గ్రహాలు తమ రాశులను మార్చబోతున్నాయి. సూర్యుడు, శుక్రుడు మరియు అంగారకుడు గమనంలో పెను మార్పురాబోతుంది. గ్రహాల సంచారం అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. ఈ గ్రహాల సంచారం వల్ల ఏయే రాశులవారికి మేలు జరగబోతుందో తెలుసుకుందాం.
సూర్య సంచారం: సూర్యుడిని గ్రహాల రాజు అంటారు. సూర్యుడు ప్రతి నెలా తన స్థానాన్ని మార్చుకుంటాడు. రేపు అంటే జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సమయంలో బుధుడు, సూర్యుడు కలిసి బుధాదిత్య, విపరీత మరియు భద్ర రాజయోగాలను చేయనున్నారు. సూర్యుడి సంచార సమయంలో మేషం, సింహం తదితర రాశులవారు లాభపడనున్నారు.
శుక్ర సంచారం: సంపద, కీర్తి, ఆనందం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. ప్రస్తుతం శుక్రుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. మార్స్ ఇప్పటికే అదే రాశిలో కూర్చుని ఉంది. రెండు గ్రహాల కలయిక శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా కన్య, తుల మరియు వృషభ రాశులవారు అనుకూల ఫలితాలను పొందుతారు.
అంగారక సంచారం: ఆగస్ట్‌లో అంగారకుడు తన రాశిని మార్చనున్నాడు. సాధారణంగా కుజుడు 45 రోజులకొకసారి రాశిని మారుస్తాడు. ప్రస్తుతం అంగారకుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఆగస్టు 17 వరకు అదే రాశిలో ఉంటాజు. అనంతరం కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు సంచారం వల్ల మేషం మరియు కన్యారాశి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
Also read: Sun transit 2023: రేపు సూర్యుడి గమనంలో కీలక మార్పు.. ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook