Grah Gochar 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. దీని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. సెప్టెంబరులో మూడు ప్రధాన గ్రహాలు రాశిని (Planet Transits 2022) మార్చబోతున్నాయి. గ్రహాల రాకుమారుడు బుధుడు సెప్టెంబరు 10న తిరోగమనం చేయనున్నాడు. ఆ తర్వాత సెప్టెంబరు 17న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. అదే విధంగా శుక్రుడు కూడా సెప్టెంబరు 24న కన్యారాశిలో సంచరించనున్నాడు. అంటే కన్యా రాశిలో శుక్ర,సూర్యల కలయిక ఉంటుంది. ఈ 3 గ్రహాల సంచారం కొన్ని రాశులవారికి ఆపారమైన ప్రయోజనాలను అందించనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశుల దశ తిరుగుతుంది..
వృషభం (Taurus): 3 గ్రహాల స్థానం మారడం వల్ల వృషభ రాశి వారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఆఫీసులో సీనియర్ల నుండి సపోర్టు ఉంటుంది. వ్యాపారస్తులు లాభపడతారు. పోటీపరీక్షలకు సిద్దమవుతున్న వారు విజయం సాధిస్తారు. ఈ నెలలో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. 


మిథునం (Gemini): వచ్చే నెల ఈ రాశి వారికి కలిసి వస్తుంది. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు.  విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సమయం విద్యార్థులకు అనుకూలంగా ఉండదు. కుటుంబంలో కొన్ని ఒడిదుడుకులు రావచ్చు. 


కర్కాటకం (cancer): సెప్టెంబర్ నెలలో ఈ రాశి వారు అదృష్టం ప్రకాశిస్తుంది. కెరీర్‌లో అడ్డంకులన్నీ తొలగిపోతాయి. వ్యాపారం చేసే వ్యక్తులు తమ కంపెనీని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఎక్కడైనా ఇరుక్కుపోయిన డబ్బు తిరిగి వస్తుంది. 


కుంభం (Aquarius): ఈ రాశి వారు భారీగా సంపాదిస్తారు. లక్ తో అన్ని పనులలో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు ఈ సమయంలో లాభపడతారు. మీరు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇదే మంచి సమయం. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా మెరుగుపడతారు. 


Also Read: Vinayaka Chavithi 2022: వినాయక చవితి ఎప్పుడు, విశిష్టత, పూజా విధానం 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook