Grah Gochar in May 2023: హిందూ పంచాంగం ప్రకారం, ఈ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. ఇప్పటికే శుక్రుడు, అంగారకుడు తమ రాశులను ఛేంజ్ చేశారు. రీసెంట్ గా బుధుడు మేషరాశిలో ఉదయించాడు. మే 15న సూర్యభగవానుడు తన రాశిని మార్చి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. మే నెల చివరిలో శుక్రుడు కర్కాటక రాశిలోకి  ఎంటర్ అవ్వనున్నాడు. మే 30 వరకు ఈ గ్రహాల గోచారం వల్ల కొన్ని రాశులవారు విపరీతమైన ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహ రాశి - గ్రహాల రాశి మార్పు కారణంగా సింహరాశి వారి ఆదాయం పెరుగుతుంది. లైప్ ఫార్టనర్ తో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీకు కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. 
తుల - ప్లానెట్స్ సంచారం వల్ల మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు కొత్త బట్టలు, మేకప్ వస్తువులు కొనగోలు చేస్తారు. అంతేకాకుండా మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ లైఫ్ పార్టనర్ సపోర్టు మీకు లభిస్తుంది. 
వృషభం -  గ్రహాల సంచారం వల్ల సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్టు లభిస్తుంది. మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 


Also Read: Shani jayanti 2023: శని జయంతి ఈ 5 రాశుల వారికి స్పెషల్.. వీరికి డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..


ధనుస్సు - గ్రహాల సంచారం వల్ల మీ జీతం పెరుగుతుంది. మీరు ఉద్యోగంలో మంచి పొజిషన్ కు చేరుకుంటారు. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీరు ట్రాన్సఫర్ అవ్వడానికి ఇదే అనుకూల సమయం. 
కుంభం - ఆఫీసులో కుంభరాశివారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. మీరు పూర్వీకుల ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు. ఆఫీసులో మీ ప్రాబల్యం పెరుగుతుంది. లైఫ్ పార్టనర్ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. 
వృశ్చికం -మీరు మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆదాయం డబల్ అవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీరు కొత్త ఇల్లు లేదా కారును కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు బట్టలు-అలంకరణ వస్తువులపై ఖర్చు చేసే అవకాశం ఉంది. 


Also Read:Jupiter Remedies: ఈ 2 రాశులకు గురు గ్రహం కటాక్షం తప్పనిసరి, ప్రసన్నం చేసుకునేందుకు ఏం చేయాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook