Grah Gochar 2022: అక్టోబర్‌లో ఖగోళంలో పెను మార్పు... ఏయే గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయో తెలుసా?
Grah Gochar 2022: అక్టోబరు నెలలో ఖగోళంలో పెను మార్పులు జరుగనున్నాయి. కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. దీని ప్రభావం యావత్ ప్రపంచంపై కనిపిస్తుంది.
October 2022 Grah Gochar: వచ్చే నెలలో కొన్ని ప్రధాన గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. దీని ప్రభావం కొన్ని రాశులపై శుభప్రదంగానూ, మరికొన్ని రాశులపై ప్రతికూలంగానూ ఉంటుంది. వచ్చే నెలలో గ్రహాల మార్పు ప్రతి ఒక్కరిపై పెను ప్రభావాన్ని చూపుతాయి. ఏయే రాశులు రాశిని మార్చనున్నాయో, ఏయే గ్రహాలు గమనంలోకి రానున్నాయో తెలుసుకుందాం.
16 అక్టోబరు 2022 - మిథునరాశిలో అంగారక సంచారం
అక్టోబర్ నెలలో మొదటి మార్పు మిథునరాశిలో కనిపిస్తుంది. అక్టోబర్ 16న కుజుడు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు యెుక్క ఈ రాశి మార్పు వల్ల ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది.
17 అక్టోబర్ 2022 - తులారాశిలో సూర్య సంచారం
కుజుడు రాశి మారిన ఒక్కరోజులోనే సూర్యుడి రాశిలో మార్పు కనిపిస్తుంది. ప్రస్తుతం సూర్యుడు కన్యారాశిలో కూర్చున్నాడు. సూర్యుని యొక్క ఈ మార్పు అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది.
18 అక్టోబర్ 2022- తులారాశిలో శుక్ర సంచారం
తులారాశిలో శుక్రుని సంచారం అక్టోబర్ నెలలో జరిగే అతిపెద్ద ఖగోళ సంఘటనలలో ఒకటి. తులారాశికి అధిపతి శుక్రుడు. ఇతడు తులారాశిలోకి ప్రవేశించినప్పుడు రాజయోగం ఏర్పడుతుంది. దీంతో మీ జీవితాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి.
23 అక్టోబర్ 2022 - మకర రాశిలో గమనంలోకి శనిదేవుడు
ఈ నెలలో జరిగే అతి పెద్ద ఖగోళ ఘట్టం శని గ్రహ సంచారం. శని ఇప్పుడు తిరోగమనంలో ఉన్నాడు. ఈ రోజున శని ప్రత్యక్ష సంచారంలోకి వస్తాడు. మరో విశేషమేమిటంటే మకర రాశికి అధిపతి శనిదేవుడు. శని మార్గం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి శని పరిహారం చేయండి.
26 అక్టోబర్ 2022- తులారాశిలో బుధ సంచారం
తులారాశిలో అక్టోబరులో చాలా మార్పులు జరుగనున్నాయి. సూర్యుడు మరియు శుక్రుడు తరువాత బుధుడు ఈ రాశిలో సంచరిస్తాడు. కేతువు అప్పటికే ఇక్కడ కూర్చున్నాడు. అదే సమయంలో, చంద్రుడు కూడా ఈ రోజున ఉంటాడు. ఈ రోజు నుండి తులారాశిలో 5 గ్రహాలు కలిసి ఉంటాయని చెప్పవచ్చు. దీని ప్రభావం మేషం నుండి మీనం వరకు ఉన్న వారిపై ఉంటుంది.
30 అక్టోబర్ 2022 - మిథునరాశిలో కుజుడు తిరోగమనం
జ్యోతిషశాస్త్రంలో మార్స్ తిరోగమనం ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ రోజున కుజుడు మిథునరాశిలో తిరోగమనం చేస్తాడు. కుజుడు ధైర్యం, సైన్యం మరియు భూమి మొదలైన వాటికి కారకంగా పరిగణించబడ్డాడు. ఆస్ట్రాలజీ ప్రకారం, ఒక గ్రహం తిరోగమనంలో ఉన్నప్పుడు దాని శక్తి తగ్గుతుంది.
Also Read: Budh Margi 2022: దసరాకి 3 రోజుల ముందు భారీ మార్పు.. ఈ 5 రాశులవారి ఇంట్లో డబ్బే డబ్బు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook