Grahana Yogm 2023 Sun Transit in Aries 2023: హిందూ పంచాంగం ప్రకారం గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటాయి. ఒక్కొక్కసారి వివిధ రాశుల్లో ఉదయించడం లేదా అస్తమించడం జరుగుతుంటుంది. మొత్తం ఈ పరిణామాలన్నీ రాశుల జాతకాలపై ప్రభావం చూపిస్తుంటుంది. సూర్యుడి గోచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏప్రిల్ 14 వ తేదీన సూర్యుడు మేష రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ రాశిలో సూర్యుడు పటిష్టంగా ఉండటం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుందంటారు. కానీ ఈసారి సూర్య గోచారం ప్రభావం మరోలా ఉంది. మేషరాశిలో సూర్యుడి రాకకు ముందే రాహువు తిష్టవేసి ఉన్నాడు. అంటే సూర్య, రాహు గ్రహాల యుతి ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశులవారికి ఇబ్బందులు తప్పవు. అంటే మరో 48 గంటల తరువాత ఆ మూడు రాశులకు తీవ్రమైన కష్టాలు తప్పవని తెలుస్తోంది. అది కూడా నెలరోజులు కష్టకాలం చవిచూడాల్సిన పరిస్థితి.


కన్యా రాశి:


ఈ రాశి అష్టమ పాదంలో యోగం ఏర్పడనుండటంతో.. కన్యారాశి జాతకులకు అంతా ప్రతికూలంగా ఉంటుంది. అన్నీ అశుభ పరిణామాలు ఎదురౌతాయి. దుర్ఘటనలకు బలయ్యే అవకాశముంది తస్మాత్ జాగ్రత్త అని సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులు వ్యాధిబారిన పడవచ్చు. ఈ సమయంలో ఎవరికైనా డబ్బులు అప్పివ్వకుండా ఉంటే మంచిది. లేకపోతే సమయానికి చేతికి రాక ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ధననష్టం కలుగుతుంది. డబ్బులు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వివాదాలు పెరగవచ్చు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.


Also Read: Surya budh yuti 2023: మరో 4 రోజుల్లో ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. ఇందులో మీ రాశి ఉందా?


వృషభ రాశి:


సూర్యుడి మేష రాశి ప్రవేశంతో సూర్య, రాహు గ్రహాల యుతి కారణంగా మానసిక ఒత్తిడి, కుటుంబంలో కష్టాలుంటాయి. ఈ క్రమంలో ఖర్చులు అదుపుతప్పుతాయి. ఆదాయం పెరగకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు తప్పవు. అనవసర ప్రయాణాలు చేయవచ్చు. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరమైన సమస్యలు వెంటాడవచ్చు.


మకర రాశి


మకర రాశి జాతకంలో 4వ పాదంలో సూర్య, రాహు గ్రహాల యుతి ఏర్పడనుంది. కుటుంబసభ్యులతో వ్యవహారం చెడిపోతుంది. మీకు వ్యతిరేకంగా ప్రత్యర్ధులు కుట్ర పన్నవచ్చు. ఈ పరిస్థితుల్లో ఆర్ధిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. గ్రహణ యోగం ఉన్నంతవరకూ అంటే నెలరోజుల వరకూ ఖర్ఛులు అధికమౌతాయి. ఆర్ధిక స్థితి ప్రభావం చూపిస్తుంది. 


Also Read: Venus Transit 2023: శుక్రుడి గోచారంతో ఆ 5 రాశులకు నెలరోజుల వరకూ కనకవర్షమే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook