Worshiping Goddess Mahavidya During Auspicious Times During Gupta Navratri: హిందూ సంప్రదాయంలో నవరాత్రులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం నాలుగు నవరాత్రులు వస్తాయి. వాటిల్లో రెండు గుప్త నవరాత్రులు కాగా..మిగిలినవి శారదీయ నవరాత్రులుగా పిలుస్తారు. అయితే వీటినే భారతీయులు చైత్ర నవరాత్రులు కూడా అంటారు. ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఈ నవరాత్రిలను గుప్త నవరాత్రులుగా పిలుస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నవరాత్రుల్లో సన్యాసి, సాధు, సిద్ధి సాధకులు, తాంత్రికులు ఆధ్యాత్మిక సాధన చేస్తారని భారతీయుల నమ్మకం. గుప్త నవరాత్రులలో అమ్మవారి 10 మహావిద్యలను పూజిస్తారు. అందుకే చాలా మంది ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధనను రహస్యంగా చేయడం ఆనవాయితిగా వస్తోంది. ఇలా చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని, దుష్ట శక్తుల ప్రభావం మనుషులపై పడకుండా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


మహావిద్యలు అంటే ఏమిటి:
మహావిద్యలు అంటే అమ్మవారి 10 అవతారాలు. ఈ నవరాత్రుల్లో అమ్మవారి పది అవతారాలను పూజించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా మంత్ర శక్తిల తీవ్రతను బట్టి మహావిద్యలను అధారపడి ఉంటాయిని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దశల వారిగా మహావిద్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


Also Read: Delhi Crime: ఢిల్లీలో కలకలం.. ఒకే రోజు ముగ్గురు హత్య  


  1. భువనేశ్వరి

  2. భైరవి

  3. కాళీ

  4. ధూమావతి

  5. ఛిన్నమస్తా

  6. తార

  7. బగళాముఖి

  8. కమలాత్మిక

  9. త్రిపుర సుందరి

  10. మాతంగి


మహావిద్యలు ఎలా ఆవిర్భవించాయి:


దేవి పురాణం ప్రకారం.. మహావిద్యల మూలం శివుడితో ముడిపడి ఉందని నమ్ముతారు. శివపార్వతుల మధ్య వివాదం కారణంగా..దక్ష ప్రజాపతి రాజు దేవతల యాగం కారణంగా ఈ మహావిద్యలు ఆర్భవించాయని భక్తుల నమ్మకం. ఈ సమయాల్లో అమ్మవారి 10 అవతారలను పూజించడం వల్ల జీవితంలో కష్టాలన్ని దూరమవుతాయని భక్తుల నమ్మకం. 


ఆరాధన శుభ సమయం:
నవరాత్రి మొదటి రోజు శైలపుత్రి అవతారన్ని పూజించడం ఆనవాయితిగా వస్తోంది. ఈ రోజు స్వయాన అమ్మవారు వెసిన చోట పూజా కార్యక్రమాలు చేయాలి. ఈరోజు ఉదయం 5.23 గంటల నుంచి 7.27 గంటల వరకు కలశ స్థాపనకు శుభ ముహూర్తం. ఆ తర్వాత జూన్ 20 మంగళవారం బ్రహ్మచారిణి అమ్మవారిని పూజిస్తారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


Also Read: Delhi Crime: ఢిల్లీలో కలకలం.. ఒకే రోజు ముగ్గురు హత్య  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook