Jupiter and Rahuvu Yuti 2023: ఏప్రిల్ 23న గురుడు, రాహువు కలయిక.. ఈ 4 రాశులకు తీవ్ర ఇబ్బందులు.. ఏం చేస్తే ఉపశమనం కలుగుతుంది..?
Guru Chandala yogam 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రంలో నిర్ణీత సమయంలో వివిధ గ్రహాలు వేర్వేరు రాశుల్లో పరివర్తనం చెందుతుంటాయి. గ్రహాల రాశి పరివర్తనం ప్రభావం కొన్ని రాశులపై అనుకూలంగా, మరికొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటోంది. గ్రహాల కలయికతో జరిగే పరిణామాలేంటో పరిశీలిద్దాం!
Jupiter and Rahuvu Yuti 2023: ఏప్రిల్ నెల జ్యోతిష్యం ప్రకారం అత్యంత మహత్యమైంది. ఈ నెలలో గురు, రాహు గ్రహాలతో యుతి ఏర్పడనుంది. గ్రహాల కలయిక వల్ల ఏర్పడే ఇలాంటి యుతితో కొన్ని రాశులకు ఊహించని విధంగా అదృష్టం మారిపోనుంది. అదే సమయంలో కొన్ని రాశులకు ప్రతికూలంగా ఉంటుంది. ఇప్పుడు ఏర్పడనున్న గురు చండాలయోగం ప్రభావం ఎలా ఉంటుంది..
హిందూ పంచాంగం ప్రకారం ఏప్రిల్ 23వ తేదీన గురుడు, రాహువు కలిసి యుతి ఏర్పర్చనున్నాయి. ఈ యుతితో గురు చండాల యోగం ఏర్పడనుంది. దీని ప్రభావం ముఖ్యంగా 4 రాశులపై పడనుంది. ఈ నాలుగు రాశుల జీవితాల్లో తీవ్రమైన కష్టాలు ఎదురుకానున్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రతి రంగంలో 7 నెలల వరకూ తీవ్ర నష్టాలే ఎదుర్కోవల్సి వస్తుంది. గురు చండాల యోగం ప్రభావమైతే మొత్తం 12 రాశులపై పడినా ఈ నాలుగు రాశులకు మాత్రం ఇబ్బందులు తప్పవు. అది కూడా ఏకంగా 7 నెలల వరకూ. అయితే కొన్ని చిట్కాలు లేదా పద్ధతులు పాటించడం ద్వారా కష్టాల్నించి బయటపడవచ్చు.
గురు చండాల యోగం నుంచి తప్పించుకునే పద్ధతులు
జ్యోతిష్యం ప్రకారం గురు చండాల యోగం దుష్ప్రభావం నుంచి ఈ నాలుగు రాశుల జాతకులు కొన్న పద్ధతులు పాటించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ప్రతి సోమవారం నాడు గుడికి వెళ్లి శివునికి అభిషేకం చేయాలి. బేలపత్రం సమర్పించాలి. దాంతోపాటుగా కాస్సేపు గుడిలోనే ఉండి మహా మృత్యుంజయ మంత్రం జపించాలి. ప్రతి గురువారం నాడు అరటి చెట్టుని పూజించాలి. పశువులుకు తిండి పెట్టాలి. ఇలాంటి కొన్ని ఉపాయాలతో గురు చండాల యోగం నుంచి కాపాడుకోవచ్చంటారు జ్యోతిష్యులు.
గురు చండాల యోగం 2023 ప్రభావం
ధనస్సు రాశి
ఏప్రిల్ 23వ తేదీన ఏర్పడనున్న గురు చండాల యోగం ప్రభావం ధనస్సు రాశి జాతకులపై అసాధారణంగా ఉండనుంది. అంటే తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రతి క్షణం ఏదో తెలియని భయం వెంటాడుతుంది. ఆరోగ్యం పాడై సమస్యల్లో పడతారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నందున వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అవసరం. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురౌతాయి.
Also Read: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో నాలుగు గ్రహాల మహా కలయిక.. ఈ 5 రాశులకు తిరుగులేదు ఇక..
కన్యా రాశి
గురు, రాహు గ్రహాల యుతితో ఏర్పడనున్న గురు చండాల యోగం ప్రభావం కన్యారాశి జాతకంపై తీవ్రంగా ఉంటుంది. తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు ఎదురౌతాయి. ఏ పని చేసినా నష్టాలే కలుగుతాయి. కుటుంబంలో విభేదాలు రావచ్చు. అప్పులు తీసుకోవల్సిన దుస్థితి ఏర్పడుతుంది. అందుకే ఖర్చులు తగ్గించుకుంటూ పొదుపు పాటించాల్సి ఉంటుంది.
మిథున రాశి
గురు చండాల యోగం ప్రభావంతో కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందులో ఒకటి మిథున రాశి. ఈ రాశి జాతకులపై గురు చండాల యోగం దుష్ప్రభావం చూపించనుంది. బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది. కుటుంబంలో జరగకూడదని ఘటన జరగవచ్చు. వ్యాపారంలో తీవ్ర నష్టాలుంటాయి. పెట్టిన పెట్టుబడి నష్టపోతారు. ఏ పని చేసినా పూర్తిగా ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయాల్సి ఉంటుంది.
మేష రాశి
గురు చండాల యోగం ప్రభావంతో ఏప్రిల్ 23 నుంచి మేష రాశి జాతకులకు అన్నీ ఇబ్బందులే. శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పిల్లల చదువు, ఆరోగ్యం సమస్యగా మారుతుంది. కోర్టు వివాదాలు మిమ్మల్ని నానాతిప్పలు పెడతాయి. ఆర్ధిక ఇబ్బందులు వెంటాడుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook