Guru Chandra Yuti 2023 effect: ఒకే రాశిలో రెండు లేదా అంతకంటే గ్రహాల కలయికను యుతి లేదా సంయోగం అంటారు. ఇవి కాలానుగుణంగా శుభ లేదా అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. అలాంటి రాజయోగం ఇవాళ అంటే మే 17న ఏర్పడింది. దేవగురు బృహస్పతి మరియు చంద్రుని కలయిక కారణంగా అరుదైన గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగాన్ని ఆస్ట్రాలజీలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశులవారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గజలక్ష్మీ రాజయోగం ఈ రాశులకు వరం
మేషం
గజకేసరి రాజయోగం మేష రాశి వారికి మంచి ఫలితాలను ఇవ్వనుంది. మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీకు కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
మిథునం
గురు, చంద్రుల కలయికతో ఏర్పడిన గజకేసరి రాజయోగం మిథునరాశి వారికి కలిసి వస్తుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీ ఆర్థికంగా బలపడతారు. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. మీకు లక్ కలిసి వస్తుంది. మీ వ్యక్తిత్వంతో పది మందికి ఆదర్శంగా నిలుస్తారు.
తులారాశి
గజకేసరి రాజయోగం తులా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. మీ పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. తుల రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. 


Also read: Venus transit 2023: జూన్ లో ఈ 4 రాశులవారు భారీగా డబ్బు పొందబోతున్నారు.. మీరున్నారా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook