Gajlaxmi Rajyog 2023: హోలీ తర్వాత ఈ రాశులకు మహర్దశ.. ఇందులో మీరున్నారా?
Gajlaxmi Rajyog 2023: ఏప్రిల్ నెలలో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడనుంది. దీని కారణంగా ఈ సంవత్సరం హోలీ తర్వాత ఈ రాశుల అదృష్టం ఛేంజ్ కానుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Guru Gochar 2023 April: ఈసారి హోలీ తర్వాత కొన్ని రాశులవారి జాతకం మారిపోనుంది. ప్రస్తుతం దేవగురు బృహస్పతి మీనరాశిలో సంచరిస్తున్నాడు. హోలీ తర్వాత అంటే ఏప్రిల్ 22న గురుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. అదే సమయంలో చంద్రుడు కూడా మేషరాశిలోకి వెళ్లనున్నాడు. గురు, చంద్రుల కలయిక వల్ల గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. శని మహాదశ ముగియనుంది. ఈయోగం మూడు రాశులవారికి మేలు చేస్తుంది. గజలక్ష్మీ యోగం వల్ల ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.
గజలక్ష్మీ రాజయోగం ఈ రాశులకు శుభప్రదం
మేషరాశి: బృహస్పతి సంచారం వల్ల ఏర్పడిన చంద్ర-గురు సంయోగం గజలక్ష్మి యోగాన్ని సృష్టిస్తుంది. ఇది మేషరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు విజయం సాధిస్తారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. లవ్ సక్సెస్ అవుతుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది.
మిథునం : మిథున రాశి వారికి గజలక్ష్మి రాజయోగం చాలా లాభాలను ఇస్తుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది.
ధనుస్సు: గజలక్ష్మి యోగం ధనుస్సు రాశి వారికి ఆకస్మిక ధనలాభాలను ఇస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. పెట్టుబడి ద్వారా ప్రయోజనం ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. మీరు పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే కోరిక నెరవేరుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook