Guru Ka Gochar 2023: ఈ రాశులవారిపై చతుర్భుజ యోగం ఎఫెక్ట్.. 6 రాశులవారు ఆర్థికంగా బలపడబోతున్నారు!
Guru Ka Gochar 2023: బృహస్పతి గ్రహం మేషరాశిలోకి సంచారం చేసింది. కాబట్టి సంచార ప్రభావంతో పలు రాశువారికి చాలా లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. పలు రాశువారు ఆర్థికంగా కూడా బలపడుతారు.
Guru Ka Gochar 2023: గ్రహాల్లో అతి పెద్ద గ్రహం బృహస్పతి..ఏప్రిల్ 22న తెల్లవారుజామున 03.33 గంటలకు మేషరాశిలోకి సంచారం చేసింది. దీనితో పాటు ఏప్రిల్ 27న గురుడు మేషరాశిలో సంచారం చేయబోతోంది. బృహస్పతి, రాహువుల కలయిక వల్ల గురు చండాల యోగం కూడా ఏర్పడింది. రాహువు, బుధుడు ఇప్పటికి సంచార దశలోనే ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో చతుర్భుజ యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో పలు రాశులవారికి మంచి జరిగే.. మరికొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే రాశులవారిపై ఈ ప్రభావం పడబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై ప్రభావం:
మేష రాశి:
బృహస్పతి సంచారం మేషరాశివారికి ఫలప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగాలు చేసేవారు ఈ క్రమంలో మంచి ఫలితాలు పొందుతారు. నిలిచిపోయిన పాత పనులన్నీ పూర్తవుతాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఈ క్రమంలో ఉపశమనం లభిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో విభేదాలు తొలగిపోతాయి.
Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో
వృషభ రాశి:
అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ క్రమంలో ఉపశమనం లభిస్తుంది. ఈ సంచారం వల్ల కొత్త ఆదాయ వనరులు అందుతాయి. ప్రేమ జీవిత గడుపుతున్నవారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి ఈ క్రమంలో మంచి లాభాలు కలుగుతాయి.
మిథున రాశి:
గురుగ్రహం కూడా సంచార దశలోకి వెళ్తుంది. కాబట్టి ఈ రాశివారికి కూడా చాలా రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆదాయంలో కూడా పెరుగుదల ఉంటుంది. కావున పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు, పురోభివృద్ధి లభిస్తాయి.
కర్కాటక రాశి:
బృహస్పతి సంచారం చేయడం వల్ల కర్కాటక రాశి జీవితంలో కూడా మార్పులు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సమాజంలో గౌరవం పెరుగడమేకాకుండా మంచి పేరు సంపాదించుకుంటారు. ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి ఈ క్రమంలో ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా వ్యాపారంలో లాభం భారీ లాభాలు కూడా పొందుతారు. ఈ రాశివారికి ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయి.
Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
కన్య రాశి:
ఈ సంచారం కన్యారాశిపై సానుకూల ప్రభావం చూపబోతోంది. ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో గడుపుతారు. కన్యా రాశి వారు ఈ సమయంలో ఏ పని చేసినా విజయం సాధిస్తారు. పెళ్లి కాని వారికి వివాహ యోగం కలుగబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.