COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Guru Gochar 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రం లోకి ప్రవేశిస్తుంది. ఇలా నక్షత్ర సంచారం జరగడం కారణంగా కూడా ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. అయితే ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవతలకు అధిపతిగా వ్యవహరించే బృహస్పతి ఏప్రిల్ 17న రాత్రి సమయంలో కృత్తికా నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యక్షంగా ఈ సంచార ప్రభావం పడబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో మూడు రాశుల వారు విపరీతమైన ధన లాభాలను పొందుతారు. అలాగే ఈ సమయంలో కష్టపడి పనులు చేసిన వారికి ఊహించని ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. అయితే దేవ గురు గృహస్పతి కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల ఏయే రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.



మిథున రాశి:
కృత్తికా నక్షత్రం లోకి బృహస్పతి సంచారం చేయడం కారణంగా మిథున రాశి వారికి ఈ సమయంలో ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతోంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఆర్థిక లాభాలతో పాటు కొత్త ఆదాయ వనరులు కూడా కలుగుతాయి. అలాగే ఒంటరి జీవితం గడుపుతున్న వారికి వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా ఈ సమయంలో సులభంగా తిరిగి వస్తాయి. దీంతో పాటు గతంలో నష్టపోయిన వ్యాపారాలు కూడా లాభసాటిగా మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎప్పటినుంచో వ్యాపారంలో వస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి.


కర్కాటక రాశి:
కృతిక నక్షత్రంలోకి దేవ గురు బృహస్పతి ప్రవేశించడం వల్ల కర్కాటక రాశి వారికి కూడా విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి జాతకంలోని పదవ స్థానంలో ఈ సంచారం జరగబోతోంది. కాబట్టి వీరికి అదృష్టం రెట్టింపు అవుతుంది. దీని కారణంగా ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. అలాగే నిలిచిపోయిన పనులు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు పర్యాటక ప్రదేశాలు కూడా సందర్శించే అవకాశాలు ఉన్నాయి దీని కారణంగా మరింత మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అలాగే రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉన్నవారికి పెద్ద పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వీరు దేవాలయాలను కూడా సందర్శించవచ్చు. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


మేషరాశి:
దేవ గురు నక్షత్ర సంచారం కారణంగా మేషరాశి వారికి వ్యాపారాల్లో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా వీరికి పిల్లలకు సంబంధించిన విషయాల్లో కూడా అనేక శుభవార్తలు వింటారు. అలాగే ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రమోషన్స్ కూడా లభించబోతున్నాయి. కానీ వీరికి ఖర్చులు పెరిగి ఆదాయంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా డబ్బును ఆదా చేసేందుకు ప్రయత్నించండి అలాగే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ సమయంలో వీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందగలుగుతారు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి