Guru Gochar 67 Days Lucky Zodiacs: జూన్ 13 రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ రోజు దేవగురు బృహస్పతి నక్షత్ర సంచారం చేసింది. ఈ గ్రహం నక్షత్ర సంచారం చేయడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహం చంద్ర నక్షత్రం నుంచి రోహిణి నక్షత్రంలోకి సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై దాదాపు 68 రోజుల పాటు ఈ సంచారం ప్రభావం ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశులవారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడమే కాకుండా జీవితంలో వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఆనందం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశులవారికి బోలెడు లాభాలు:
మేష రాశి:

గురు గ్రహ సంచారం కారణంగా మేష రాశివారికి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పెరుగుతుంది. దీంతో పాటు ఆదాయ వనరులు కూడా రెట్టింపు అవుతాయి. అలాగే కుటుంబ సభ్యుల విషయాల్లో కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆకస్మికంగా కూడా డబ్బులు పొందుతారు. ఇక విద్యార్థులకు ఈ సమయంలో చాలా ఆనందంగా ఉంటుంది. దీంతో పాటు ఈ సమయంలో ఎలాంటి పరీక్షలు రాసిన తప్పకుండా విజయాలు సాధిస్తారు. అలాగే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. 


మిథున రాశి:
మిథున రాశివారికి కూడా  ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో లాటరీలు కొనుగోలు చేసేవారికి ఊహించని మనీ లభిస్తుంది. అలాగే భీమాపై కూడా డబ్బులు ఖర్చు పెట్టే ఛాన్స్‌ కూడా ఉంది. దీంతో పాటు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. యువత ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు.  అలాగే ఆరోగ్యంపై కూడా మిథున రాశివారు కాస్త జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది. 


సింహ రాశి:
సింహ రాశివారికి కూడా గురు గ్రహం రోహిణి నక్షత్రంలోకి సంచారం చేయడం వల్ల విపరీతమైన లాభాలు కలుగుతాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం ఎంతో శుభ ప్రదంగా ఉంటుంది. దీంతో పాటు వ్యాపారాల్లో భారీగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. దీంతో పాటు వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఆటంకాలు కూడా తొలగిపోతాయి. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ధనుస్సు రాశి:
67 రోజుల పాటు ధనస్సు రాశివారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. అలాగే విశ్వాసం పెరిగి ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. దీంతో పాటు పోటీ సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఎంతో మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్‌ కూడా ఉంది. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడతారు. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి