Guru Gochar 2024: పుష్కర కాలం తర్వాత వృషభరాశిలోకి బృహస్పతి.. ఈ 3 రాశులకు ధనప్రాప్తి..

Guru Gochar 2024: అదృష్టాన్ని ఇచ్చే బృహస్పతి న్యూ ఇయర్ లో వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. గురుడు కదలికలో ఈ మార్పు వల్ల మూడు రాశులవారు 2024లో ధనవంతులు కాబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Jupter Transit in taurus 2024: నెమ్మదిగా కదిలే గ్రహాల్లో బృహస్పతి కూడా ఒకటి. గురు గ్రహం కదలికలో మార్పు ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. కొత్త సంవత్సరంలో దేవగురు గమనంలో పెను మార్పు రాబోతుంది. అదృష్టాన్ని ఇచ్చే బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. ఈ అద్భుత ఘట్టం వచ్చే ఏడాది మే నెలలో జరగబోతోంది. గురు సంక్రమణ వల్ల ఏయే రాశులవారు అదృష్టం మారబోతుందో తెలుసుకుందాం.
సింహరాశి
గురుడు రాశి మార్పు సింహరాశి వారికి ఎనలేని ప్రయోజనాలను అందిస్తుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతోంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ట్రిప్ కు వెళ్లే అవకాశం ఉంది. భార్యభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వ్యాపారులు బాగా లాభపడతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
మేష రాశి
2024లో బృహస్పతి ఇదే రాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే ఈ రాశివారిపై మాత్రం అతడి అనుగ్రహం ఉండనుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. వ్యాపారులకు కొనుగోళ్లు పెరిగి బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరిగిపోతుంది. ప్రతి పనిలో లక్ కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. జంక్ పుడ్ జోలికి అస్సలు పోవద్దు.
కర్కాటకం
వృషభరాశిలో బృహస్పతి సంచారం కర్కాటక రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. ఈరాశి వారు అన్ని రకాల సమస్యల నుండి బయటపడతారు. కొత్తగా పెళ్లైన దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. వ్యాపారులకు విదేశాల నుంచి పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తాయి. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది.
Also Read: Grah yuti 2024: న్యూ ఇయర్ లో మిత్ర గ్రహాల కలయిక.. ఈ 4 రాశులకు తిరుగులేదు ఇక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook