Guru Gochar 2023: దేవగురు బృహస్పతి ఇవాళ మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. 12 ఏళ్ల తర్వాత గురుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. పైగా ఇదే రోజు అక్షయ తృతీయ కూడా. రాబోయే ఏడాది పాటు బృహస్పతి మేషరాశిలోనే ఉంటాడు. గురుడు సంచారం కారణంగా 5 రాశులవారు శుభఫలితాలను పొందుతారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహ రాశి : గురుడు యొక్క రాశి మార్పు సింహ రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. మీరు ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. అంతేకాకుండా విదేశీ ప్రయాణం కూడా చేస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. 


కన్య: బృహస్పతి సంచారం వల్ల కన్యారాశి వారికి అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని పొందుతారు. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు మంచి లాభాలను ఆర్జిస్తారు. 


మేషరాశి: గురు గ్రహ సంచారం మేషరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం నలుగురిని ఆకర్షిస్తుంది. మీరు కెరీర్ పుంజుకుంటుంది. ఆదాయం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 


Also Read: Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ నాడు 'మహా సంయోగం'.. ఈ 4 రాశులపై డబ్బు వర్షం..


వృషభం: బృహస్పతి సంచారం వృషభ రాశి వారికి లాభాలను ఇస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు రుణ విముక్తి నుండి బయటపడతారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే అనుకూల సమయం. 


మిథునం: మిథునరాశి వారికి బృహస్పతి సంచారం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వ్యాపారం విస్తరిస్తుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ సమయంలో ప్రయోజనం పొందుతారు. 


Also read: Surya Guru Yuti 2023: మేష రాశిలో అరుదైన కలయిక.. ఈ రోజు నుంచి ఈ 3 రాశులకు అన్నీ లాభాలే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook