RajYog 2023: అరుదైన యోగం చేస్తున్న కుజుడు-గురుడు.. ఈ 4 రాశులవారి సుడి తిరగడం పక్కా...
Mars Transit 2023: జూలై 01న గ్రహాల కమాండరైన అంగారకుడు సింహరాశి ప్రవేశం చేశాడు. ఇదే సమయంలో గురుడుతో కలిసి నవపంచమ రాజయోగాన్ని సృష్టించాడు. దీని వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Benefits of Navpancham Yog 2023: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. జూలై 01న కుజుడు తన రాశిని మార్చి సింహరాశిలోకి ప్రవేశించాడు. ఇదే సమయంలో దేవగురు బృహస్పతి మేషరాశిలో సంచరిస్తున్నాడు. దీంతో కుజుడు, గురుడు కలిసి నవపంచమ యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ యోగం ప్రజలందరి జీవితాల్లో పెను మార్పు తీసుకురానుంది. ముఖ్యంగా నవపంచమ యోగం వల్ల నాలుగు రాశులవారు లాభాలను పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
సింహ రాశి: గురు-అంగారకుడు చేసిన నవపంచం యోగం కూడా సింహ రాశి వారికి మంచి లాభాలను ఇస్తుంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీకు అదృష్టం కలిసి వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది.
తుల రాశి : నవపంచం యోగం ఏర్పడటం తుల రాశి వారికి మంచిది. వీరు వృత్తి, వ్యాపారాల్లో ప్రయోజనం పొందుతారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీకు పెద్ద మెుత్తంలో ధనం అందుతుంది. పెళ్లి కాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.
మేషం: ఈ రాశికి అధిపతి కుజుడు. దీని కారణంగా మేషరాశి వారికి నవపంచం యోగం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారి సంపద, గౌరవం పెరుగుతుంది. సంతానప్రాప్తి కలుగుతుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం దొరుకుతుంది. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
కర్కాటకం: నవపంచం యోగం కర్కాటక రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. మీరు ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది.
Also Read: Ketu Gochar 2023: జూలై 08 వరకు చిత్రా నక్షత్రంలోనే కేతువు.. ఈ 4 రాశులకు ఊహించనంత ధనలాభం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK